E-Paper
Advertisement

Aiden Markram: కోహ్లీ, రోహిత్ బ్యాగులు స‌ర్దేశారు..ఇక టీమిండియాను నేల నాకిస్తాం!

Aiden Markram: కోహ్లీ, రోహిత్ బ్యాగులు స‌ర్దేశారు..ఇక టీమిండియాను నేల నాకిస్తాం!

Aiden Markram: రేపటి నుంచి టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ టీమిండియా జట్టు నుంచి వెళ్లిపోయారు… ఇక టి20లో మా సత్తా చూపిస్తామంటూ ప్రకటించారు. ఇండియాను ఓడించి టైటిల్ గెల్చుకుంటామని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ టీమిండియాలో లేకపోవడం తమకు అడ్వాంటేజ్ అన్నారు. ఈ గ్యాప్ లోనే సిరీస్ గెలుచుకోవాలని వివరించారు ఐడెన్ మార్క్‌రమ్.

Also Read: Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే

రోహిత్ శర్మ, కోహ్లీ లేకున్నా లైట్ తీసుకోబోం

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు దూరం కానున్నారు. ఇద్దరు ప్లేయర్లు లేకుండానే ఇప్పుడు టి20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇలాంటి నేపథ్యంలో దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ మీడియాను అడ్రస్ చేశారు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియాను ఎదురుకోవడం చాలా కష్టమన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోయారు, టీమిండియాను ఓడించే సమయం కూడా ఆసన్నమైంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే వాళ్ళిద్దరూ లేకపోతే టీమిండియా ఓడిపోతుందని చెప్పలేం, టి20 లో కూడా ఆ జట్టు చాలా బలంగా ఉందన్నారు ఐడెన్ మార్క్‌రమ్. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో అద్భుతంగా రాణిస్తుందని గుర్తు చేశారు. అయినప్పటికీ రేపటి మ్యాచ్ లో తమ సత్తా చాటుతామన్నారు. అభిషేక్ శర్మను కట్టడి చేసే విధంగా తమ ప్లాన్స్ సిద్ధం చేశామని ఐడెన్ మార్క్‌రమ్ వెల్లడించారు. ఆ సీక్రెట్ మాత్రం మేము బయటకు రివీల్ చేయబోమని పేర్కొన్నారు. అలాంటి సీక్రెట్లు బయటపెడితే ప్రత్యర్థి జట్టు అలర్ట్ అవుతుందన్నారు.

ఉచితంగా మ్యాచ్ ఎలా చూడాలంటే ?

ఇది ఇలా ఉండగా రేపటి నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగానే మొట్టమొదటి టి20 మ్యాచ్ కటక్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. అటు స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్‌లు తిలకించవచ్చు. రేపటి టి20 మ్యాచ్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గిల్ రి-ఎంట్రీ నేపథ్యంలో అతనికి వైస్ కెప్టెన్సీ దక్కనుంది. హార్దిక్ పాండ్యాతో పాటు బుమ్రా జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వికెట్ కీపర్ గా సంజు ఆడతాడా? లేక జితేష్ శర్మకు అవకాశం ఇస్తారా? అనేది రేపు ఫైనల్ కానుంది. రేపు ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటు గిల్ బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఫస్ట్ డౌన్ కు సూర్య కుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపటి కటక్ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు విశ్లేషకులు.

Also Read: DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే

 

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×