E-Paper
Advertisement

Best Electric Autos: మహీంద్రా ట్రెయో జోర్ TO యూలర్ హైలోడ్ EV.. బెస్ట్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోలు ఇవే!

Best Electric Autos: మహీంద్రా ట్రెయో జోర్ TO యూలర్ హైలోడ్ EV.. బెస్ట్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోలు ఇవే!
Advertisement

Best Electric Autos Delivery Service: భారత్ లో రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఫ్యూయెల్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణహితమైన ప్రయాణాలకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్లు, బైకులతో పాటు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బెస్ట్ ప్యాసింజర్, కార్గో ఎలక్ట్రిక్ ఆటోలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టాప్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోలు

⦿ మహీంద్రా ట్రియో: ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో విభాగంలో ఈ ఆటో టాప్ లో ఉంది. ఒకే ఛార్జ్ తో ఏకంగా 140 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. 10 hp పవర్, 2 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 సంవత్సరాలు లేదంటే 1.5 లక్షల కి.మీ. బ్యాటరీ వారంటీతో వస్తుంది.

Advertisement

⦿ పియాజియో ఏప్ ఇ సిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్:  ఈ ఆటో స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో పాపులర్ అయ్యింది. ఇది ఇది కనీస డౌన్‌టైమ్ ను కలిగి ఉంటుంది. ఒకే ఫుల్ ఛార్జ్ మీద 150 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది.

⦿ గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ: ఈ ఎలక్ట్రిక్ ఆటో ఒకే ఛార్జ్ మీద 225 కి.మీ వరకు మంచి రేంజ్ ను అందిస్తుంది. దృఢమైన మెటల్ బాడీతో తయారవుతుంది. దీనికి 5 నుంచి 6 గంటల ఛార్జింగ్ సమయం ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

⦿ బజాజ్ RE E-TEC 9.0: ఈ ఆటో ఎత్తైన ప్రదేశాలను కూడా ఈజీగా ఎక్కుతుంది. ఒకే ఛార్జ్ మీద ఏకంగా 170 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. 2 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ ను కలిగి ఉంది.

⦿ మోంట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటో:  ఈ ఎలక్ట్రిక్ ఆటో సౌకర్యవంతమైన, విశాలమైన ఇంటీరియర్స్ ను కలిగి ఉంటుంది.  ఒకసారి ఛార్జ్ చేస్తే 152 కి.మీ ప్రయాణాన్ని అందిస్తుంద. ఛార్జింగ్ సమయం కూడా తక్కువగానే ఉంటుంది

Read Also: హీరో లవర్స్ కు షాక్, స్ప్లెండర్ ధరలు పెరిగాయ్!

రోజువారీ కమర్షియల్ వినియోగానికి బెస్ట్ ఎలక్ట్రిక్ ఆటోలు  

⦿ యూలర్ హైలోడ్ EV: ఇది ఒకే ఛార్జ్ తో 151 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. 688 నుంచి 768 కిలోల బరువును ఈజీగా తీసుకెళ్తుంది. పవర్ ఫుల్ కార్గో ఎలక్ట్రిక్ 3-వీలర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ మహీంద్రా ట్రెయో జోర్: ఈ ఎలక్ట్రిక్ ఆటో కూడా 550 కిలోల బరువును మోసుకెళ్తుంది. ఒకే ఛార్జ్ తో 125 కి.మీ ప్రయాణించవచ్చు. అత్యధికంగా అమ్ముడైన కార్గో ఆటోల్లో ఇది ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ ఆల్టిగ్రీన్ neEV: ఈ ఆటో ఒకే ఛార్జ్ మీద 150 కి.మీ వెళ్లే అవకాశం కల్పిస్తుంది. దీని మోటార్ 11 hp శక్తితో అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది.

మొత్తంగా రోజువారీ రవాణా సేవల కోసం  మహీంద్రా ట్రెయో, పియాజియో ఏప్ ఇ-సిటీ బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ ఆటోలు, మంచి సర్వీస్ నెట్ వర్క్ తో పాటు రీసేల్ వ్యాల్యూను కలిగి ఉన్నాయి.

Read Also: ఇకపై ఎలక్ట్రిక్ కార్లు సౌండ్ చేయాలట, ఎందుకో తెలుసా?

Tags

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×