E-Paper
Advertisement

Electric Cars: పెట్రోల్ బంకులతో పనిలేదు.. కిలోమీటరుకు కేవలం రూ.2.50 ఖర్చుతో రాజాలా తిరగండి!

Electric Cars: పెట్రోల్ బంకులతో పనిలేదు.. కిలోమీటరుకు కేవలం రూ.2.50 ఖర్చుతో రాజాలా తిరగండి!
Advertisement

Electric Cars: ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడమే కాకుండా, పర్యావరణహితంగా ప్రయాణించేందుకు చాలామంది వాహనదారులు ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు బడ్జెట్ ధరలోనే అత్యాధునిక ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 లక్షల లోపు అందుబాటులో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు మీకోసం..

MG Comet EV

తక్కువ బడ్జెట్‌లో లభించే ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కోమెట్‌ ముందు వరుసలో ఉంటుంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) పద్ధతిలో దీని ధర రూ.4.99 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. పూర్తి బ్యాటరీతో కావాలంటే రూ.7.59 లక్షలు చెల్లించాలి. 17.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు ఈ ఎంజీ కోమెట్‌ ఈవీ చాలా అనువైనది.

Tata Tiago EV

Advertisement

మధ్యతరగతి వారికి ఫేవరెట్ ఛాయిస్ టాటా టియాగో ఈవీ. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు. దీనిలో 19.2kWh, 24kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా 250 కిలోమీటర్ల నుంచి 315 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. మూలనపడ్డ పాత మొబైల్‌ను 5 రకాలుగా వాడుకోవచ్చు!

Tata Punch EV

Advertisement

కారు చూడటానికి స్టైలిష్‌గా ఉండాలనుకుంటే టాటా పంచ్ ఈవీ బెస్ట్ ఛాయిస్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.9.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 30 kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్లలో లభించే ఈ కారు గరిష్టంగా 468 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే కేవలం 26 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఈ కారు ప్రత్యేకత.

Maruti Suzuki e-Vitara

మారుతీ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ కారు ఇ-విటారా. బ్యాటరీ సర్వీస్ పద్ధతిలో దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. 49kWh, 61kWh ఆప్షన్లలో లభించే ఈ కారు, గరిష్టంగా 543 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది క్రెటా ఈవీ, టాటా కర్వ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఉందంటున్నారు నిపుణులు.

MG Windsor EV

ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారు ఎంజీ విండ్‌సర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర రూ.13.99 లక్షల నుంచి మొదలవుతుంది. 38 kWh, 52.9 kWh బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే ఈ కారు 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ కారు 60kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను సపోర్ట్ చేస్తుంది.

Tata Tigor and Nexon EV

సెడాన్ ఇష్టపడే వారికి రూ.12.5 లక్షల ధరలో టిగోర్ ఈవీ అందుబాటులో ఉంది. ఇక పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి టాటా నెక్సాన్ ఈవీ బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ. 12.5 లక్షలు. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు సిట్రోయెన్ eC3 కూడా రూ.12.90 లక్షల ధరలో 246 కిలోమీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో రాణిస్తోంది.

Also Read: మీరు వాడిపడేసిన పాత ఫోన్‌నే CCTV Cameraగా మార్చేయొచ్చు.. అదెలాగంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×