E-Paper
Advertisement

Best Electric Scooters: రోజువారీ అవసరాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, రేంజ్ కూడా సూపరండోయ్!

Best Electric Scooters: రోజువారీ అవసరాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, రేంజ్ కూడా సూపరండోయ్!
Advertisement

రోజువారీ ప్రయాణాలకు అనుకుగుణంగా ఉండే పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మంచి రేంజ్ తో పాటు చూడ్డానికి స్టైలిష్ గా ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్లు, మంచి పనితీరుతో ఏథర్, సూపర్ టెక్నాలజీతో ఓలా, సిటీ ప్రయాణాలకు ఉపయోగపడేలా TVS iQube, ఫ్యామిలీతో వెళ్లేలా ఏథర్ రిజ్టా లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీల విషయానికి వస్తే, క్లాసిక్ బజాజ్ చేతక్, హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా అందుబాటులో ఉన్నాయి.

రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఒకవేళ మీరు పట్టణ ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈవీలను ఎంచుకోవలంటే ఈ స్కూటర్లను కొనుగోలు చెయ్యొచ్చు.

Advertisement

⦿ ఏథర్ 450X/అపెక్స్/ రిజ్టా: స్మార్ట్ ఫీచర్లు, ఈజీ ఛార్జింగ్, మంచి బిల్డ్ క్వాలిటీతో నగర ప్రయాణానికి ఈ స్కూటర్లను అనుకూలంగా ఉంటాయి. సిటీలో ఈజీగా ప్రయాణం చేసేలా ఉంటాయి.

⦿ ఓలా S1 ప్రో/X: ఇది పవర్ ఫుల్ మోటార్ ను కలిగి ఉంటుంది. టెక్ ఫార్వర్డ్ ఎక్స్ పీరియెన్స్ తో ఆకట్టుకుంటుంది. S1 X బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

Advertisement

⦿ TVS iQube: చక్కటి సిటీ రైడింగ్ అనుగుణంగా ఉంటుంది. పలు ట్రిమ్‌ లలో అందుబాటులో ఉంది.

⦿ బజాజ్ చేతక్: మంచి రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్‌ అవకాశం ఉంటుంది. రెట్రో స్టైల్, ప్రీమియం ఎంపిక, నగర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.

ప్రైమరీ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకోవాలంటే ఈ మోడల్స్ ను ట్రై చేయడం మంచిది.

⦿ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా: తక్కువ దూరం, రోజువారీ రైడ్‌లకు అనుగుణంగా ఉంటుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది.

⦿ ఆంపియర్ మాగ్నస్: ఈ స్కూటర్ మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఖర్చు కాస్త ఎక్కువ అయినా, రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది.

⦿ ఏథర్ రిజ్టా: మంచి రేంజ్, చక్కటి ఫీచర్లతో ఉంటుంది. ఫ్యామిలీ వెళ్లేందుకు అనుగుణంగా ఉంటుంది.

లాంగ్ రేంజ్ ప్రయాణాలకు అనుగుణంగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకోవాలనుకునే వారికి కింది మోడల్స్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ సింపుల్ వన్  జనరేషన్ 2: లాంగ్ రేంజ్ ప్రయాణాలకు ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటుంది.

⦿ విడా V2: హీరో నుంచి వచ్చిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. సిటీ ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది.

ఈవీని కొనేప్పుడు చూడాల్సిన ఫీచర్లు

⦿ రేంజ్: ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనే సమయంలో చూడాల్సింది రేంజ్. ఒకే ఛార్జ్ మీద ఎంత దూరం వెళ్తుందనేది  అంశాన్ని బట్టి అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలి.

⦿ ఛార్జింగ్ టైమ్: ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యేలా ఉండాలి.

⦿ స్పీడ్,పవర్: నగర ట్రాఫిక్‌ కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

⦿స్మార్ట్ ఫీచర్‌లు: యాప్ కనెక్టివిటీ, నావిగేషన్, డిజిటల్ డాష్‌ బోర్డులను గమనించాలి.

⦿ బ్యాటరీ లైఫ్: లిథియం అయాన్ బ్యాటరీ మన్నిక, వారంటీని చూసుకోవాలి.

మొత్తంగా ఓలా S1 X లాంటి మోడల్స్ సరసమైన ధరను అందిస్తాయి. ఏథర్ 450X మంచి పనితీరును కనబరుస్తుంది.

Read Also:  టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV వచ్చేసింది.. రేంజ్ ఏంతో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×