E-Paper
Advertisement

Trump In Davos-2026: ట్రంప్‌కు ఆదిలో అపశృతి.. విమానానికి తప్పిన ముప్పు, మరొక విమానంలో దావోస్‌కు

Trump In Davos-2026: ట్రంప్‌కు ఆదిలో అపశృతి.. విమానానికి తప్పిన ముప్పు, మరొక విమానంలో దావోస్‌కు
Advertisement

Trump In Davos-2026: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికా నుంచి దావోస్ ఆర్థిక వేత్తల సదస్సు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం యూటర్న్ తీసుకుని మెరీల్యాండ్‌లో సేప్‌గా ల్యాండైంది. అక్కడి నుంచి మరొక విమానంలో ట్రంప్ దావోస్‌కు చేరుకున్నారు.

ట్రంప్ దావోస్ టూర్ ఆదిలో అపశృతి

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి అమెరికా నుంచి దావోస్‌కు బయలుదేరారు. ఆయన ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పరిస్థితి గమనించిన పైలట్, వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. అర్ధరాత్రి వాషింగ్టన్ సమీపంలోని బేస్ ఆండ్రూస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విద్యుత్ సమస్యని పైలట్ గుర్తించారు.

ట్రంప్ మరొక విమానంలో దావోస్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. నార్మల్‌గా అయితే అమెరికా అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడు ప్రయాణించే విమానంలో ఆ తరహా ఘటనలు చాలా అరుదు. ఆ తరహా ఘటనలు ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు.

Advertisement

విమానానికి తప్పిన ముప్పు.. మరొక విమానంలో దావోస్‌కు

2011 లో ఓ కార్యక్రమానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను తీసుకెళ్తుండగా వాతావరణ సమస్యల కారణంగా ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండింగ్‌ను రద్దు అయ్యింది. మరుసటి ఏడాది 2012 లో అప్పటి ఉపాధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ టూ విమానానికి కాలిఫోర్నియాలో పక్షి ఢీ కొట్టింది. కానీ ఎలాంటి సమస్య లేకుండా ఆ విమానం సేఫ్‌గా ల్యాండైంది.

దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హై-ప్రొఫైల్ మీటింగ్ సమావేశం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీల ఛైర్మన్లతో బుధవారం ట్రంప్ భేటీ కానున్నారు. భారతీయ వ్యాపార దిగ్గజాలతో ఆయన కీలక భేటీ జరగనుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత WEFOలో డోనాల్డ్ ట్రంప్ హల్చల్ చేయనున్నారు. గ్లోబల్ ఎకానమీపై ట్రంప్ స్పెషల్ ఫోకస్ చేస్తారని చెబుతున్నప్పటికీ గ్రీన్‌ల్యాండ్ వ్యవహారంపై యూరప్ వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ALSO READ: నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ రిటైర్మెంట్

స్విట్జర్లాండ్‌‌కు బయలు దేరేముందు వైట్ హౌస్‌లో  మీడియా సమావేశం జరిగింది. తాను స్విట్జర్లాండ్‌లో అందమైన ప్రదేశానికి వెళ్తున్నానని, అందుకోసం చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు అధ్యక్షుడు ట్రంప్. అధికారంలోకి వచ్చి తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా బయలు దేరుతున్నట్లు చెప్పారు. డెన్మార్క్ నుండి గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి మీరు ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా అడిగిన ప్రశ్నకు మీరు చూస్తారంటూ చిరునవ్వుతో బదులిచ్చారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×