HBD Priyanka Chopra:గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. ప్రపంచ సుందరిగా కిరీటాన్ని ధరించి.. 2002లో తమిళన్ అనే తమిళ చిత్రం ద్వారా నటన రంగ ప్రవేశం చేసి.. ఒక్కో మెట్టు ఎదుగుతూ తన ఉనికిని చాటుకుని ప్రయత్నం చేసింది. ఎప్పుడు ప్రారంభించాం.. ఎక్కడ ప్రారంభించాం.. అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం మనం ఎలాంటి స్థాయిలో ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తోంది ప్రియాంక చోప్రా. ముఖ్యంగా తమిళ సినిమా ద్వారానే తన కెరియర్ ను మొదలుపెట్టినప్పటికీ నేడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.
2003లో తొలిసారి ది హీరో : లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై అనే హిందీ చిత్రం ద్వారా ఊహించని పాపులారిటీ అందుకుంది. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పుడు మొదట్లో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత మౌత్ టాక్ కారణంగా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అద్భుతమైన నటన కనబరుస్తూ.. ఉత్తమ నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎన్నో అవార్డులు కూడా అందుకున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్లో కెరియర్ లో పీక్స్ లో ఉన్నప్పుడే హాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
also read:న్యాయం కావాలి.. ఫెడరేషన్ పై నిర్మాతలకు జానీ మాస్టర్ కంప్లైంట్!
ఇకపోతే మళ్లీ ఇన్నేళ్ల తరువాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి చిత్రం ద్వారా ఇండియాకి తిరిగి వచ్చిన ఈమె ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమె పాత్రకు సంబంధించిన రెండు ఫోటోలను దర్శకుడు రాజమౌళి తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..” ఈమె నవ్వితే అందం.. నవ్వకపోతే అగ్ని” అంటూ పోస్ట్ కూడా షేర్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోని ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే సాధారణంగా ప్రియాంక చోప్రా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం అంటే వారణాసి అని అందరూ అనుకుంటున్నారు. కానీ వారణాసి కంటే ముందే ప్రియాంక చోప్రా తెలుగులో ఒక సినిమాలో నటించిన విషయం మీకు తెలుసా? మరి ఏంటా చిత్రం ? ఎప్పుడు విడుదల అయ్యింది? అందులోని నటీనటులు ఎవరు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆ సినిమా ఏంటంటే?
ఇకపోతే ప్రియాంక చోప్రా తెలుగులో నటించింది కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా ఏంటంటే ‘అపురూపం’. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయం కావాల్సింది. ప్రముఖ దర్శకుడు జి ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రసన్న, మధుకర్ హీరోలుగా నటించారు. పైగా ఈ సినిమా నుండి పోస్టర్స్ ఆడియో సాంగ్స్ కూడా విడుదలయ్యాయి.త్వరలోనే పూర్తి చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మధ్యలోనే ఆర్థిక సమస్యల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఆ సినిమాలోని ఆమె స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలోని ప్రియాంక చోప్రా మరింత సన్నగా తన అందమైన చిరునవ్వుతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తర్వాత 2003లో ఆమె బాలీవుడ్ లో తన మొదటి అవకాశాన్ని అందుకుంది . అలా 23 ఏళ్ల క్రితమే తెలుగులో తొలిసారి నటించిన ప్రియాంక చోప్రా.. ఆ చిత్రం విడుదల కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమై.. మళ్ళీ ఇప్పుడు వారణాసితో అడుగుపెడుతోంది.