E-Paper
Advertisement

KTM New year 2026 Offer: ఫ్రీ యాక్సెసరీస్, పదేళ్ల వ్యారెంటీ.. KTM బైక్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ బ్రో!

KTM New year 2026 Offer: ఫ్రీ యాక్సెసరీస్, పదేళ్ల వ్యారెంటీ.. KTM బైక్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ బ్రో!
Advertisement

KTM  2026 Offer: యువతకు KTM బైక్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు అదిరిపోయే అడ్వెంచరస్ బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. రోజువారీ రైడింగ్‌తో పాటు లాంగ్ హైవే ట్రిప్‌లు, ప్రమాదకరమైన రోడ్ల మీద నడిపే బైక్స్ ను కొనాలని ప్లాన్ చేస్తుంటే, వెంటనే 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X బైక్స్ ను కొనుగోలు చేయండి. ఎందుకంటే, ఈ రెండు మోడల్స్ పై కొత్త సంవత్సరం సందర్భంగా అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. KTM  390 అడ్వెంచర్ శ్రేణిపై ఫ్రీ యాక్సెసరీస్ తో పాటు వ్యారెంటీని పొడిగించింది. ఈ ఆఫర్ దేశంలోని అధీకృత KTM డీలర్‌ షిప్‌ లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కొద్ది రోజుల పాటే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

KTM అందించే న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ ఏంటంటే?

KTM అందించే ఈ న్యూ ఇయర్ ఆఫర్ KTM 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X బైక్స్ కు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు అదనపు ఖర్చు లేకుండా రూ. 10,000 విలువైన KTM  యాక్సెసరీస్ పొందే అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా, KTM రూ. 2,650 విలువైన 10 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ ప్యాకేజీని అందిస్తుంది. ఈ ఆఫర్ లో భాగంగా హెడ్ ల్యాంప్ ప్రొటెక్టర్, మడ్ ఫ్లాప్ ఎక్స్ టెన్షన్, లోయర్ ఫెండర్, సెంటర్ స్టాండ్, టూరింగ్ సీట్, బైక్ కవర్ ఉంటాయి. అటు ఉచితంగా ఎక్స్ టెండెడ్ వ్యారెంటీ ప్యాకేజీ అందిస్తుంది. ఇది 10 సంవత్సరాల వరకు కవరేజీ అందిస్తుంది. స్టాండర్డ్ వ్యారెంటీతో పాటు ఎక్స్ టెండెడ్ వారెంటీ కలిపి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్ది కాలమే ఉన్న నేపథ్యంలో వినియోగదారులు ఉపయోగించుకోవాలని కంపెనీ సూచించింది.

 KTM 390 అడ్వెంచరస్ బైక్స్ గురించి..

Advertisement

KTM 390 అడ్వెంచర్ అనేది ఇండియన్ అడ్వెంచర్ బైక్ కేటగిరీలో టాప్ లో ఉంటుంది. ఈ అడ్వెంచర్ బైక్ 8,500 rpm దగ్గర 45.3 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6,500 rpm దగ్గర 39 Nm టార్క్‌ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 398.63 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో 21 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రియర్ వీల్ ఉన్నాయి.  రెండూ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌ తో ఉంటాయి. ఈ సెటప్ మోటార్‌ సైకిల్ గుంతల మయం అయిన రోడ్ల మీద వెళ్లేందుకు సాయపడుతుంది. సస్పెన్షన్ ట్రావెల్ కూడా ముందు భాగంలో 200 mm, వెనుక భాగంలో 205 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 237 mm ఉంటుంది. అడ్వెంచర్ రైడింగ్‌కు ఈ కౌంట్స్ అనుకూలంగా ఉంటాయి. బైక్ ఎత్తుపల్లాలు, గుంతల మయమైన  భూ భాగాలను దాటడానికి సాయపడుతాయి. ఎందుకంటే అవి బైక్ కింది భాగాన్ని స్క్రాప్ చేయకుండా ఉపయోగపడుతాయి.

KTM 390 అడ్వెంచర్ బైక్ అత్యాధునిక భద్రత, టెక్నికల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, LED హెడ్‌ ల్యాంప్, రైడ్ బై వైర్ థ్రోటిల్, మల్టీపుల్  రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌ షిఫ్టర్, కార్నరింగ్ ABS, స్విచ్చబుల్ ABS, స్లిప్పర్ క్లచ్, USB ఛార్జర్‌ తో వస్తుంది. దీనిలో అడ్జెట్ చేసేయగలిగే సస్పెన్షన్ రైడర్లు ఉంటాయి. బైక్ 182 కిలోల కెర్బ్ బరువు, 14.5 లీటర్ల కెపాసిటీ కలిగిన ప్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. లాంగ్స్ డ్రైవ్స్ కు అనుగుణంగా ఉంటుంది.

Advertisement

Read Also: ట్రోల్, డీజిల్ కార్లను ఈవీలుగా మార్చండి, ఏకంగా రూ. 50 వేల ఆఫర్ పట్టేయండి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×