E-Paper
Advertisement

Yamaha Best Selling Bikes: MT 15 To ఫ్యాషినో.. అత్యధికంగా అమ్ముడవుతున్న యమహా బైక్స్ ఇవే!

Yamaha Best Selling Bikes: MT 15  To  ఫ్యాషినో.. అత్యధికంగా అమ్ముడవుతున్న యమహా బైక్స్ ఇవే!
Advertisement

Yamaha Best Selling Bikes India 2025: ఇండియాలో యమహా బైక్స్, స్కూటర్లకు మంచి మార్కెట్ ఉంది.  2025 తాజాగా సేల్స్ డేటా, ఆధారంగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 టూ వీలర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యమహా ఇండియా ప్రధానంగా స్కూటర్లు, 125-155cc బైక్‌లపై ఫోకస్ చేస్తోంది. 2025లో టాప్ సెల్లర్లుగా ఈ కేటగిరీ బైక్స్ నిలిచాయి. తాజాగా గణాంకాల ఆధారంగా RayZR, FZ సిరీస్ టాప్‌లో ఉన్నాయి.

⦿ Yamaha RayZR 125 (స్కూటర్)

స్పోర్టీ లుక్, మంచి మైలేజ్ (50+ kmpl), యూత్‌కు పాపులర్.

Advertisement

నెలవారీ సేల్స్: 15,000-20,000+ యూనిట్స్.

ధర: రూ. 85,000 నుంచి ప్రారంభం.

Advertisement

ఇది స్కూటర్ అయినప్పటికీ.. అమ్మకాల్లో దూసుకెళ్తోంది. యమహా అమ్మకాల్లో భారీగా పెంపునకు కారణం అయ్యింది. ఇండియాలోనే ద్విచక్ర వాహన అమ్మకాలలో టాప్ లిస్టులో కొనసాగుతోంది.

⦿ Yamaha FZ Series (FZ-S FI, FZ-X)

మస్క్యులర్ డిజైన్, మంచి పర్ఫార్మెన్స్ & మైలేజ్.

నెలవారీ సేల్స్: 14,000-16,000 యూనిట్స్.

ధర: రూ. 1.20 లక్షల నుంచి.

FZ లైనప్ యమహా అమ్మకాలలో ముందంజలో ఉంది. మంచి పనితీరు, చక్కటి మైలేజ్, TFT డిస్ ప్లే లాంటి ఆధునిక ఫీచర్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇవి రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి.

⦿ Yamaha MT-15 V2 (స్ట్రీట్‌ ఫైటర్ బైక్)

అగ్రెసివ్ లుక్, 155cc ఇంజన్, ట్రాక్షన్ కంట్రోల్.

నెలవారీ సేల్స్: 10,000-13,000 యూనిట్స్.

ధర: రూ. 1.68 లక్షల నుంచి.

R15 నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ వెర్షన్. ఇది ప్రీమియం 150cc విభాగంలో అమ్మకాల్లో దూకుడు కొనసాగుతోంది. మంచి స్టైలింగ్, పనితీరు కారణంగా అత్యధికంగా అమ్ముడవుతోంది.

⦿ Yamaha YZF-R15 V4 (స్పోర్ట్స్ బైక్)

రేసింగ్ డిజైన్, క్విక్‌షిఫ్టర్, హై పర్ఫార్మెన్స్.

నెలవారీ సేల్స్: 7,000-9,000 యూనిట్స్.

ధర: రూ. 1.82 లక్షల నుంచి.

యంగ్ రైడర్లకు చాలా ఇష్టమైన బైక్. స్పోర్ట్‌ బైక్ స్టైలింగ్, మంచి పనితీరు, డ్యూయల్ ఛానల్ ABS లాంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ Yamaha Fascino 125 (స్కూటర్) / Aerox 155

Fascino: రెట్రో స్టైల్, లైట్‌వెయిట్.

Aerox: స్పోర్టీ మ్యాక్సీ స్కూటర్.

నెలవారీ సేల్స్: Fascino 5,000-8,000 యూనిట్స్, Aerox 2,000-3,000.

ధర: Fascino రూ. 80,000 నుంచి ప్రారంభం అవుతుంది.

యమహా స్కూటర్ల అమ్మకాల్లో Fascino బాగా దూసుకెళ్తుంది. మంచి స్టైల్, హైబ్రిడ్ టెక్నాలజీ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

Read Also: ఐకానిక్ RX100 వచ్చేస్తోంది సరికొత్తగా.. లాంచింగ్ ఎప్పుడంటే?

యమహా బైక్స్ ఆదరణకు కారణాలు

⦿ పనితీరు, స్టైల్: స్పోర్టీ లుక్స్ (R15, MT-15), మస్క్యులర్ అప్పీల్ (FZ) కలిగిన బైక్‌లను అందించడంలో యమహా ముందుంది.  అ

⦿ టెక్నాలజీ: ఇటీవలి మోడళ్లలో యమహా మోటార్ ఇండియాTFT డిస్ ప్లేలు, నావిగేషన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

⦿ కమ్యూటర్, స్పోర్ట్ ఫోకస్: FZ సిరీస్ స్టైలిష్ కమ్యూటర్లను అందిస్తుంది.  R15, MT-15 పనితీరు 150cc విభాగంలో మంచి దూకుడు కొనసాగిస్తోంది.

Read Also:  రూ. లక్ష లోపు రాబోయే 10 సూపర్ బైక్స్ ఇవే.. నచ్చింది కొనేయండి బాస్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×