E-Paper
Advertisement

Fuel Saving Secret: కారు ఎంత స్పీడ్ లో వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది? హైవేలో ఎంత? సిటీలో ఎంత?

Fuel Saving Secret: కారు ఎంత స్పీడ్ లో వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది?  హైవేలో ఎంత? సిటీలో ఎంత?
Advertisement

Better Mileage Car Speed: పెట్రోల్ వినియోగం అనేది కారు మోడల్, ఇంజిన్, ట్రాఫిక్, AC వినియోగం, డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ కార్లు మంచి మైలేజ్ పొందాలంటే ఎంత స్పీడ్ తో వెళ్లాలి? ఎంత స్పీడ్ తో వెళ్తే ఫ్యూయెల్ త్వరగా అయిపోతుంది? ఎంత వేగంతో వెళ్లే ప్యూయెల్ వేస్ట్ అవుతుంది? అనేది చూద్దాం..

హైవేలో ఎంత స్పీడ్ తో వెళ్లాలి?   

⦿ మంచి మైలేజీకి  బెస్ట్ స్పీడ్ గంటకు 70 నుంచి 90 కిమీ.

Advertisement

⦿ చాలా మంది దాదాపు గంటకు 80 కిమీ వేగంతో వెళ్తే మంచి మైలేజీ వస్తుందంటారు. లీటర్ కు సుమారు 18 నుంచి 22 కిమీ మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది.

⦿ గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణిస్తే మైలేజ్ తగ్గుతుంది.

Advertisement

⦿గంటకు 120 కిమీ,అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే, ఫ్యూయెల్ వినియోగం 20 నుంచి 30 శాతానికి పైగా ఎక్కువ ఖర్చు అవుతుంది.

సిటీలో ఎంత వేగంతో ప్రయాణించాలి?

⦿ సిటీ ట్రాఫిక్‌ లో స్థిరమైన వేగాన్ని కొనసాగించలేరు.

⦿సాధారణంగా 40–60 కి.మీ వేగంతో వెళ్తే మంచి మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది.

⦿ త్వరగా వేగం అందుకోవడం, హార్డ్ బ్రేకింగ్, సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయడం వల్ల చాలా పెట్రోల్ వేస్ట్ అవుతుంది.

⦿ సిటీలో సాధారణంగా 10 నుంచి 15 కి.మీ వేగంతో ప్రయాణిస్తే, లీటర్ మైలేజ్ 8–12 కి.మీకి పడిపోతుంది.

⦿ ట్రాఫిక్ తక్కువగా ఉండి స్మూత్ డ్రైవ్ చేస్తే లీటర్ పెట్రోల్ కు 14–18 కి.మీ మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది.

హైవే, సిటీ ప్రయాణాల్లో మంచి మైలేజ్ రావాలంటే?

హైవే ప్రయాణంలో పెట్రోల్ ఆదా చేయడానికి బెస్ట్ స్పీడ్ గంటకు 70–90 కి.మీ. 100 కి.మీ వేగంతో వెళ్తే మైలేజ్ తగ్గుతూ వస్తుంది. 120 కి.మీ వేగంతో వెళ్తే పెట్రోల్ మరింతగా వేస్ట్ అవుతుంది.  ఇక సిటీలో పెట్రోల్ ఆదా చేయడానికి బెస్ట్ స్పీడ్ గంటకు 40–60 కి.మీ. ఆకస్మిక స్టార్ట్‌ లు, పదే పదే స్టాప్‌లు, ట్రాఫిక్ కారణంగా మైలేజ్ తగ్గడం ప్రారంభం అవుతుంది. భారీ ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు పెట్రోల్ మరింత వేస్ట్ అవుతుంది.

Read Also:  ప్యూయల్ ట్యాంక్ కొన్నికార్లకు రైట్ సైడ్, మరికొన్ని కార్లకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకో తెలుసా?

పెట్రోల్ ఆదా చేసుకునేందుకు బెస్ట్ టిప్స్  

⦿ అవసరం అయినప్పుడు మాత్రమే ACని ఉపయోగించండి. అలా చేయడం 10–15% ప్యూయెల్ ఆదా అవుతుంది.

⦿ ఎమర్జెన్సీ బ్రేక్‌లు, వేగవంతమైన స్టార్ట్‌ లను మానుకోవాలి.

⦿ టైర్ ప్రెజర్ సరిగ్గా మెయింటెయిన్ చేయాలి.

⦿ ఇంజిన్ వేడెక్కిన తర్వాత సజావుగా డ్రైవ్ చేయాలి.

⦿ బెస్ట్ మైలేజ్ కోసం మైలేజ్ డిస్‌ ప్లేను చూస్తూ ప్రయాణించండి.

Read Also: సెల్ఫ్ స్టార్ట్ ఫెయిల్.. కిక్ రాడ్ లేదు.. బైక్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×