E-Paper
Advertisement

హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు.. క్రెటాపై ఏకంగా రూ.1 లక్ష డిస్కౌంట్!

హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు.. క్రెటాపై ఏకంగా రూ.1 లక్ష డిస్కౌంట్!

Hyundai Discounts In June 2026: జూన్ 2026లో కొత్త కారు కొనాలని భావిస్తున్న వారికి హ్యుందాయ్ అదిరిపోయే  ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ పోర్ట్‌ ఫోలియోలోని చాలా మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి ఎక్కువ బెనిఫిట్స్ క్రెటా, వెర్నా, క్రెటా ఎలక్ట్రిక్, గ్రాండ్ i10 నియోస్ మోడళ్లపై లభిస్తున్నాయి. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హ్యుందాయ్ క్రెటా: రూ. 1 లక్ష

హ్యుందాయ్ క్రెటాపై గరిష్టంగా రూ.1 లక్ష వరకు ప్రయోజనాలు అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్లపై క్యాష్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, అప్‌గ్రేడ్ బెనిఫిట్ లాంటి ఆఫర్లు కలిపి ఈ ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, డీజిల్ వేరియంట్లపై ఆఫర్లు పరిమితంగానే ఉన్నాయి. ప్రస్తుతం క్రెటా ధర రూ.10.9 లక్షల నుంచి రూ.19.91 లక్షల వరకు ఉంది.

⦿ వెర్నా సెడాన్‌: రూ. 95 వేల తగ్గింపు

వెర్నా సెడాన్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. పాత వెర్షన్లపై రూ.95,000 వరకు బెనిఫిట్స్ లభిస్తుండగా, ఇటీవల విడుదలైన ఫేస్‌ లిఫ్ట్ మోడల్‌ పై రూ.55,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వెర్నా ధరలు రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

⦿ క్రెటా ఎలక్ట్రిక్‌: రూ. 85 వేలు

ఎలక్ట్రిక్ వాహనాల కోసం చూస్తున్న వారికి క్రెటా ఎలక్ట్రిక్‌ పై రూ.85,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. క్యాష్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, అప్‌గ్రేడ్ ఆఫర్, కార్పొరేట్ బెనిఫిట్లు లభిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ.18.02 లక్షల నుంచి రూ.23.67 లక్షల వరకు ఉంది.

⦿ i10 నియోస్‌: రూ. 78 వేలు

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌పై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై గరిష్టంగా రూ.78,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. CNG వేరియంట్లకు కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఇప్పటికే టూ వీలర్ కలిగిన ఉన్న కొనుగోలుదారులకు అదనంగా రూ.10,000 వరకు బెనిఫిస్ ఇవ్వనున్నారు. ఈ కారు ధర రూ.5.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿ అల్కాజర్ SUV: రూ.75 వేలు

అల్కాజర్ SUV కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇదే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్లపై రూ.75,000 వరకు, డీజిల్ వేరియంట్లపై రూ.45,000 వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. అల్కాజర్ ధర రూ.14.5 లక్షల నుంచి రూ.21.1 లక్షల వరకు ఉంది.

అటు ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ i20పై రూ.63,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్టర్‌పై కూడా మంచి  డిస్కౌంట్లు ఉన్నాయి. పాత మోడళ్లపై రూ.43,000 వరకు, కొత్త ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లపై రూ.35,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. హ్యుందాయ్ ఆరా సెడాన్‌పై రూ.25,000 వరకు ప్రయోజనాలు అందిస్తుండగా, వెన్యూ SUVపై మాత్రం రూ.5,000 స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also: త్వరలో సియెర్రా EV, దీపావళికి సఫారీ EV.. టాటా ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

నిస్సాన్ టెక్టన్ లాంచ్ కు కౌంట్‌ డౌన్.. క్రెటా, డస్టర్‌ కు కొత్త సవాల్?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. హారియర్ EVకి రూ.2.75 లక్షల తగ్గింపు!

త్వరలో సియెర్రా EV, దీపావళికి సఫారీ EV.. టాటా ప్లాన్ మామూలుగా లేదుగా!

ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ వచ్చేశాయి.. ఇప్పుడు కొనడం మంచిదేనా?

ఢిల్లీలో E85 ఫ్యూయల్ అమ్మకాలు ప్రారంభం.. లీటర్ ధర జస్ట్ రూ.82!

నో పొల్యూషన్ సర్టిఫికేట్.. నో పెట్రోల్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

వాగన్ ఆర్ మాత్రమే కాదు.. భారత్‌లోకి రానున్న 5 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు ఇవే!

Big Stories

×