E-Paper
Advertisement

Bike Servicing: బైకును ఎన్ని కిమీలకు ఒకసారి సర్వీస్ చేయించాలి? లేకపోతే ఏమవుతుంది?

Bike Servicing: బైకును ఎన్ని కిమీలకు ఒకసారి సర్వీస్ చేయించాలి? లేకపోతే ఏమవుతుంది?
Advertisement

బైక్ చాలా కాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చక్కగా సర్వీసింగ్ చేయించాలి. కంపెనీ ఇచ్చిన టైమింగ్ ప్రకారం షోరూమ్ కు తీసుకెళ్లి సర్వీసింగ్ చేయించాలి. సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ హెల్దీగా ఉంటుంది. బైక్ పనితీరు బాగుంటుంది. కానీ, చాలా మంది బైక్ సర్వీసింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. మరికొంత మందికి ఎప్పుడు సర్వీసింగ్ చేయించాలో సరిగా తెలియదు. అలాంటి వారు కచ్చితంగా ఈ స్టోరీ చదవాల్సిందే.

⦿ మొదటి సర్వీస్

ఒక బైక్ కొత్తగా ఉన్నప్పుడు, ఇంజిన్ భాగాలు కదలకుండా ఉంటాయి. ఇంజిన్ లో చిన్న మెటల్ బిట్స్ ఆయిల్‌తో రాపిడికి గురవుతాయి. ఈ నేపథ్యంలో తొలి సర్వీసింగ్ అనేది 1 నెల నుంచి 2 నెలల్లోపు, 500 నుంచి 1000 కిలో మీటర్లలోపు చేయించాలి. ఈ సర్వీసింగ్ సమయంలో ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్‌ను మారుస్తారు. వదులుగా ఉన్న  బోల్ట్‌ లను టైట్ చేస్తారు.  బ్రేక్‌లను చెక్ చేస్తారు. ఈ సర్వీసింగ్ కచ్చతంగా చేయించాల్సిందే. ఎందుకుంటే, ఇంజిన్ వారెంటీ ఉండాలంటే, ఈ సర్వీసింగ్ చేయించకతప్పదు.

⦿ రెగ్యులర్ సర్వీస్

Advertisement

ఫస్ట్ సర్వీస్ తర్వాత చాలా మంది సర్వీసింగ్ విషయంలో టైట్ తీసుకుంటారు. కానీ, ప్రతి 3 నుంచి 6 వేల కిలో మీటర్ల లోపు, లేదంటే ప్రతి 6 నెలలకు ఓసారి సర్వీసింగ్ చేయించాలి. ఇంజిన్ ఆయిల్ నెమ్మదిగా తన పలుచదనాన్ని కోల్పోతుంది. ఎక్కువ కాలం మార్చకపోతో ఇంజిన్ చాలా వేడిగా మారి, అరిగిపోతుంది.

⦿ మేజర్ సర్వీస్

ప్రతి సంవత్సరానికి లేదంటే రెండు సంవత్సరాలకు ఓసారి డీప్ సర్వీసింగ్ చేయించాలి. బైక్ ముఖ్యమైన పార్ట్ లు ఎలా ఉన్నాయో చూపించాలి. ప్రతి 12 వేల నుంచి 15 వేల కిలో మీటర్ల దూరానికి ఓసారి ఈ మేజర్ సర్వీసింగ్ చేయించాలి.  స్పార్క్ ప్లగ్,  ఎయిర్ ఫిల్టర్,  బ్రేక్ ఫ్లూయిడ్ కూలెంట్ ఆయిల్ లాంటివి చెక్ చేయించాలి. ఏవైనా సమస్యలు ఉంటే మార్చేయాలి.

ఏ సర్వీస్ ఎప్పుడు చేయించాలంటే?

Advertisement

⦿ ఫస్ట్ సర్వీస్ 500 – 1,000 కిలో మీటర్లు లేదంటే  1 – 2 నెలల్లో చేయించాలి. ఆయిల్ ఛేంజ్, బోల్డ్ లు టైట్ చేయాలి.

⦿ ప్రతి 6 నెలలకు రెగ్యులర్ సర్వీస్  చేయించాలి. లేదంటే 3,000 నుంచి  5,000 కి.మీ తిరిగాయ ఆయిల్ ఛేంజ్, చైన్ లూబ్ మార్చాలి.

⦿ ప్రతి 12,000 కి.మీలకు లేదంటే ఏడాదికి ఓసారి మేజర్ సర్వీస్ చేయించాలి. ఫిల్టర్,  స్పార్క్ ప్లగ్ లాంటివి మార్చాలి.

సర్వీసింగ్ చేస్తే కలిగే లాభం, చేయకపోతే జరిగే నష్టం ఏంటి?

బైక్ సర్వీసింగ్ టైమ్ టు టైమ్ చేస్తే ఇంజిన్ సౌండ్ ఉండదు. బైక్ స్మూత్ గా వెళ్తుంది. చేయకపోతే పెద్ద శబ్దం చేస్తుంది. పికప్ సరిగా ఉండదు. రెగ్యుల్ గా సర్వీస్ చేయడం వల్ల ఫ్యూయెల్ ఎఫిషియెన్నీ ఎక్కువగా ఉంటుంది. చేయకపోతే తక్కువగా ఉంటుంది. సర్వీసింగ్ చక్కగా చేస్తే 10 ఏళ్లకు పైగా నడిపే అవకాశం ఉంటుంది. సరిగా సర్వీసింగ్ చేయకపోతే 3 సంవత్సరాల్లోనే బైక్ చెడిపోతుంది. సో, ఇకపై మీరు కూడా చక్కగా బైక్ సర్వీసింగ్ చేయించండి. చాలా కాలం బైక్ ను జాగ్రత్తగా చూసుకోండి.

Read Also: ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర జస్ట్ రూ. 61 వేలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×