E-Paper
Advertisement

Bike Riding Tips Summer: సమ్మర్ లో బైక్ రైడింగ్.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే!

Bike Riding Tips Summer: సమ్మర్ లో బైక్ రైడింగ్.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే!
Advertisement

ఈ ఏడాది అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి అయిపోకముందే భానుడు భగభగ మండుతున్నాడు. ఈ నేపథ్యంలో బైక్ రైడింగ్ చేసే వాళ్లకు నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే రైడర్స్ ఇబ్బంది పడటంతో పాటు బైక్ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉదంటున్నారు. ఇంతకీ వేసవిలో బైక్ ప్రయాణాలు చేసే వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వేసవి బైక్ రైడింగ్ టిప్స్

Advertisement

వేసవిలో బైక్ రైడింగ్ చేసేటప్పుడు వేడి నుంచి తట్టుకునేందుకు ఎక్కువ నీళ్లు తాగిలి. హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్స్ తాగాలి. గాలి ఆడేందుకు తేలికపాటి రక్షణ దుస్తులు వేసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో కాకుండా ఉదయం లేదంటే సాయంత్రం సమయాల్లో ప్రయాణించడం చాలా వరకు మంచిది. సన్‌ స్క్రీన్ రాసుకోవడం, అక్కడక్కడా నీడకు ఆగుతూ ప్రయాణించడం, బైక్ కండిషన్‌ను చెక్ చేస్తూ వెళ్లడం మంచిది. వేసవిలో సురక్షితమైన ప్రయాణం కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ హైడ్రేషన్ ముఖ్యం: ప్రయాణం మొదలు పెట్టే ముందు, మార్గం మధ్యలో, ప్రయాణం పూర్తి అయిన తర్వాత వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. నిమ్మరసం లేదంటే కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. దాహం వేసే వరకు ఆగకుండా, మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి.

Advertisement

⦿  ఎండ నుంచి కాపాడే దుస్తులు: వేసవిలో వీలైనంత దరకు కాటన్ దుస్తులు వేసుకోవాలి. గాలి చక్కగా ఆడేలా లేత రంగు దుస్తులు లేదంటే పూర్తి వైట్ కలర్ దుస్తులను ధరించాలి. పూర్తి చేతులున్న దుస్తులు వేసుకోవడం వల్ల ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది.

⦿ సరైన సమయంలో ప్రయాణం:  ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ప్రయాణం చేయకపోవడం మంచిది. వీలైనంత వరకు ఉదయం లేదంటే సాయంత్రం ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

⦿  సన్‌ స్క్రీన్, ప్రొటెక్షన్: ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌ స్క్రీన్ వాడుకోవాలి. సన్ గ్లాసెస్ కళ్ల అలసటను తగ్గిస్తాయి. వీలైనంత వరకు సమ్మర్ లో ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.

⦿ ఆగుతూ వెళ్లాలి: ఎండాకాలంలో ప్రయాణాలు చేసే సమయంలో ఆగుతూ వెళ్లడం మంచిది. మార్గం మధ్యలో తరచుగా నీడలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచవచ్చు. ప్రయాణించేటప్పుడు అలసట, తలతిరగడం లాంటి సమస్యలు ఏర్పడితే, వెంటనే ఆగి, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

⦿ భోజనం: ప్రయాణంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వేయించిన, మసాలా పదార్థాలను నివారించడం మంచిది.

⦿ బైక్ మెయింటెనెన్స్: వేడికి టైర్లలో గాలి ఒత్తిడి పెరుగుతుంది. తరచుగా గాలి చెక్ చేసుకోవాలి.  ఇంజన్ ఆయిల్ స్థాయిలను కూడా చూసుకోవాలి.

ప్రయాణ సమయంలో చేయకూడని పనులు

⦿ ప్రయాణ సమయంలో ఆల్కహాల్, కెఫిన్ అధికంగా ఉండే డ్రింక్స్ తీసుకోవాలి. ఇవి డీహైడ్రేషన్ కు దారితీస్తాయి.

⦿ రక్షణ కోసం హెల్మెట్, గ్లోవ్స్ లేకుండా ప్రయాణించకూడదు.

Read Also: గాల్లోకి ఎగిరి హైవే సైన్ బోర్డులో ఇరుక్కుపోయిన మహీంద్రా థార్, ఇంతకీ అది నిజమేనా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×