Jupally Krishna Rao: మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను శుక్రవారం రవీంద్రభారతిలో మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
మత్తు కోరల్లో చిక్కి ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనమవుతోందని మంత్రి జూపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తలిదండ్రుల ఆశలు అడియాశలవుతున్నాయిని ఇలాంటి అరాచక శక్తులను సమాజం నుంచి ఏరిపారేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే మన లక్ష్యం కావాలి అధికారులకు సూచించారు.
మరోవైపు విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తు చేశారు.
Also Read: Summer 2026 ACs Offers: టాప్ కంపెనీల ఏసీలపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఈ ఛాన్స్ వదులుకోకండి!
స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తామని ప్రకటించారు. అక్రమ మద్యం నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అంకితభావంతో పని చేస్తున్న అధికారులను ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అభినందించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి అధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అధికారుల వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు
Also Read: Portable AC vs Split AC: బడ్జెట్, విద్యుత్ ఆదా కోసం.. ఈ రెండు ఏసీల్లో.. ఏది కొంటే బెటర్?