E-Paper
Advertisement

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
Advertisement

భారతీయ మార్కెట్లో ప్రీమియం టూవీలర్స్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో BMW అదిరిపోయే స్కూటర్ ను తీసుకొచ్చింది. C 400 GT పేరుతో మ్యాక్సీ స్కూటర్ ను పరిచయం చేసింది. సిటీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్స్‌ ను కూడా సౌకర్యవంతంగా మార్చేలా ఈ స్కూటర్‌ ను రూపొందించారు. అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్, అత్యుత్తమ కంఫర్ట్ ఫీచర్లతో సాధారణ స్కూటర్లకు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.

BMW C 400 GT ఇంజిన్ గురించి..

BMW C 400 GTలో 350cc సామర్థ్యం కలిగిన లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 34 హెచ్‌పీ పవర్, 35 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌ లో సులభంగా నడవడంతో పాటు హైవేపై కూడా మంచి పని తీరును అందిస్తుంది. స్కూటర్‌ లో CVT  గేర్‌ బాక్స్ ఉండటంతో గేర్ మార్చాల్సిన అవసరం లేకుండా స్మూత్ రైడింగ్ చేసే అవకాశం ఉంటుంది.

అత్యాధునిక భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత విషయంలో BMW కీలక ఫీచర్లు తీసుకొచ్చింది. ముందు భాగంలో డబుల్ డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్‌ ను అందించారు. అదనంగా ABS Pro, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ లాంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి స్కూటర్‌ పై కంట్రోల్ ను మరింత పెంచుతాయి.

స్టైలిష్ డిజైన్

డిజైన్ పరంగా BMW C 400 GT చాలా స్టైలిష్‌ గా కనిపిస్తుంది. మ్యాక్సీ స్కూటర్‌ కు ప్రత్యేకమైన భారీ బాడీ, ఆకట్టుకునే ఫ్రంట్ డిజైన్ దీనికి ప్రీమియం లుక్‌ ను అందిస్తాయి. పొడవైన విండ్‌ స్క్రీన్ ఉండటం వల్ల హైవే రైడింగ్ సమయంలో గాలి ఒత్తిడి తగ్గుతుంది. సుదూర ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారతాయి. రైడర్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని విశాలమైన సీటును అందించారు. ఇంటి గ్రేటెడ్ బ్యాక్‌ రెస్ట్ ఉండటం వల్ల ఎక్కువ సేపు ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. పెద్ద ఫుట్‌బోర్డ్ ఉండటంతో రైడర్ తన కాళ్లను సౌకర్యవంతంగా ఉంచుకోవచ్చు.

అత్యాధునిక టెక్నాలజీ

Advertisement

టెక్నాలజీ పరంగా కూడా ఈ స్కూటర్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో BMW కనెక్టివిటీ ప్రోతో కూడిన 10.25 అంగుళాల TFT డిస్‌ ప్లే అందించారు. నావిగేషన్, కాల్స్, వాహన సమాచారం లాంటి వివరాలను ఈ స్క్రీన్ ద్వారా సులభంగా చూడవచ్చు. USB-C ఛార్జింగ్ పోర్ట్‌ తో పాటు ముందు భాగంలో స్టోరేజ్ కంపార్ట్‌ మెంట్ కూడా ఉంది.  సీటు కింద BMW ఫ్లెక్స్‌ కేస్ స్టోరేజ్ సిస్టమ్‌ ను అందించింది. ఇది అవసరానికి అనుగుణంగా పెంచుకునేలా ఉంటుంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

ధర ఎంత అంటే?

ఇండియాలో దేశంలో BMW C 400 GT ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌ లో లభిస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.11.25 లక్షలుగా ఉంది.

Read Also: సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×