E-Paper
Advertisement

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!
Advertisement

Headphones vs Earbuds: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ మీటింగ్‌లు, ప్రయాణాలు, లేదా ఖాళీ సమయాల్లో పాటలు వినడానికి మనలో చాలామంది హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్ వాడుతుంటాం. అయితే, వీటిని నిరంతరం వాడటం వల్ల మన వినికిడి శక్తి దెబ్బతినే ప్రమాదం ఉందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి సమస్య పరికరంలో లేదు.. మనం వాడుకునే విధానంలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇయర్‌బడ్స్‌తో వచ్చే ఇబ్బందులు:

మనం వాడే ఇయర్‌బడ్స్ నేరుగా చెవి లోపలి భాగంలో అమరిపోతాయి. దీనివల్ల ధ్వని తరంగాలు నేరుగా, చాలా దగ్గరగా కర్ణభేరిని తాకుతాయి. ఫలితంగా చెవులపై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ సమయం వీటిని వాడటం వల్ల వినికిడి లోపం, చెవుల్లో నిరంతరం శబ్దం రావడం (టిన్నిటస్), చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి శబ్దం సరిగ్గా వినపడటం లేదనిపించి, మనకు తెలియకుండానే వాల్యూమ్ పెంచేస్తుంటాం. ఇది చెవులకు మరింత హాని చేస్తుంది.

హెడ్‌ఫోన్స్ ఎందుకు బెటర్?

Advertisement

చెవి పైభాగంలో పెట్టుకునే హెడ్‌ఫోన్స్ కర్ణభేరికి కాస్త దూరంగా ఉంటాయి. కాబట్టి.. సుదీర్ఘ సమయం పాటలు వినడానికి ఇవి కొంతవరకు సురక్షితమైనవిగా నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా.. వీటిలో ఉండే ‘నాయిస్ క్యాన్సిలేషన్’ ఫీచర్ వల్ల బయట వచ్చే శబ్దాలు మనకు వినిపించవు. దీనివల్ల ప్రయాణాల్లో లేదా రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవాల్సిన అవసరం రాదు. తక్కువ శబ్దంతోనే స్పష్టంగా వినవచ్చు.

Also Read: టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

నిశ్శబ్దంగా దెబ్బతీసే ప్రమాదం:

Advertisement

మనం ఏ పరికరం వాడినా.. ఎక్కువ సౌండ్ పెట్టి గంటల తరబడి వింటే ప్రమాదం తప్పదు. మన చెవి లోపల ఉండే సున్నితమైన కణాలు ఒకసారి దెబ్బతింటే అవి మళ్లీ సాధారణ స్థితికి రావు. వినికిడి సమస్యలు ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా మొదలవుతాయి. మొదట్లో అంతగా తెలియకపోయినా, రానురాను ఇతరులు మాట్లాడేది అర్థం కాకపోవడం, చెవుల్లో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎవరికైనా రావచ్చు.

చెవులను కాపాడుకునే సూత్రం:

చెవుల ఆరోగ్యం కోసం నిపుణులు ఒక సులువైన నియమాన్ని సూచిస్తున్నారు. అదే 60/60 సూత్రం. దీని ప్రకారం మనం వినే శబ్దం ఎప్పుడూ 60 శాతం వాల్యూమ్ కంటే తక్కువగా ఉండాలి. అలాగే, నిరంతరాయంగా 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం వీటిని వాడకూడదు. మధ్యమధ్యలో చెవులకు కాస్త విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. కేవలం ఇయర్‌ఫోన్స్ మాత్రమే కాదు.. నిత్యం మనం ఎదుర్కొనే ట్రాఫిక్ శబ్దాలు, లౌడ్ స్పీకర్ల వల్ల కూడా వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read: కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×