E-Paper
Advertisement

కొత్త కారు కొంటే డబ్బులు వస్తాయా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

కొత్త కారు కొంటే డబ్బులు వస్తాయా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!
Advertisement

TCS Refund Explained: చాలా మంది కొత్త కారు కొనే సమయంలో ఓ ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోరు. ముఖ్యంగా రూ.10 లక్షలకు పైబడిన కార్లు కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వం తరఫున అదనపు పన్ను వసూలు చేయబడుతుంది. దీనిని టీసీఎస్ (Tax Collected At Source) అని పిలుస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఈ డబ్బును తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చని తెలియదు. అందుకే వేలాది రూపాయలను వృథాగా వదిలేస్తున్నారు.

కారు ధరపై 1 శాతం టీసీఎస్ వసూలు

సాధారణంగా కారు కొనుగోలు చేసినప్పుడు డీలర్ వాహనం ధరపై 1 శాతం టీసీఎస్ వసూలు చేస్తాడు. ఈ మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది. అయితే, అది పూర్తిగా ప్రభుత్వ డబ్బు కాదు. ఆ మొత్తం కారు కొనుగోలు చేసిన వ్యక్తి పేరుతో, ముఖ్యంగా అతని పాన్ నంబర్‌కు లింక్ అయి నమోదు అవుతుంది. అంటే, ఆ డబ్బు మీద హక్కు కస్టమర్‌ కే ఉంటుంది. ఓ వ్యక్తి రూ.15 లక్షల విలువైన కారును కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ సమయంలో డీలర్ 1 శాతం టీసీఎస్‌గా రూ.15 వేల రూపాయలు అదనంగా తీసుకుంటాడు. ఈ మొత్తం ప్రభుత్వానికి చేరినా, అది మీ పాన్ నంబర్‌పై రికార్డ్ అవుతుంది. తర్వాత మీరు ITR  ఫైల్ చేసినప్పుడు ఆ మొత్తాన్ని రీఫండ్‌ గా పొందే అవకాశం ఉంటుంది.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే?

Advertisement

నిజానికి టీసీఎస్ రీఫండ్ వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. కారు డీలర్లు కూడా ఈ విషయాన్ని కొనుగోలుదారులకు చెప్పారు. దీంతో కస్టమర్లు ఆ డబ్బు గురించి మరిచిపోతున్నారు. కొందరు ఐటీఆర్ ఫైల్  చేయకపోవడం కూడా మరో కారణం. మరికొందరు తమ ఫారం 26AS చెక్ చేయకపోవడం వల్ల టీసీఎస్ క్రెడిట్ నమోదైందో? లేదో? కూడా తెలుసుకోలేకపోతున్నారు.

టీసీఎస్ రీఫండ్ పొందాలంటే ఎలా?

టీసీఎస్ రీఫండ్ పొందాలంటే కొన్ని ఈజీ చర్యలు తీసుకోవాలి. ముందుగా కారు డీలర్ నుంచి ఫారం 27D తీసుకోవాలి. ఇది టీసీఎస్ చెల్లించినట్లు ప్రూఫ్. ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖ వెబ్‌ సైట్‌ లో ఫారం 26ASను చెక్ చేయాలి. అక్కడ మీ పాన్ నంబర్‌ కు జమ అయిన టీసీఎస్ మొత్తం కనిపిస్తుంది.  తర్వాత మీరు ITR ఫైల్ చేసే సమయంలో ట్యాక్సెస్ పెయిడ్ లేదంటే టీసీఎస్ క్లెయిమ్ అనే సెక్షన్‌ లో ఈ మొత్తాన్ని నమోదు చేయాలి. మీ వార్షిక ఆదాయపు పన్ను తక్కువగా ఉంటే, ప్రభుత్వం ఈ టీసీఎస్ మొత్తాన్ని రీఫండ్ రూపంలో నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఒకవేళ మీకు చెల్లించాల్సిన పన్ను ఎక్కువగా ఉంటే, ఈ టీసీఎస్ మొత్తం ఆ పన్నుకు సర్దుబాటు అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అవకాశం రూ.10 లక్షలకు పైబడిన కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే రీఫండ్ పొందాలంటే పాన్ నంబర్‌ కు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. లేకపోతే రీఫండ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. సో, కొత్త కారు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా తమ ఫారం 26AS చెక్ చేసి, ITR ఫైల్ చేసే సమయంలో టీసీఎస్ క్లెయిమ్ చేసుకోవడం మంచిది.

Advertisement

Read Also: టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.3.8 లక్షల వరకు తగ్గింపు!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×