E-Paper
Advertisement

టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.3.8 లక్షల వరకు తగ్గింపు!

టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.3.8 లక్షల వరకు తగ్గింపు!
Advertisement

Tata EV Discounts Announced: ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ మే 2026 నెలకు సంబంధించి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. బ్రాండ్ కు సంబంధించిన పలు ఈవీ మోడళ్లపై రూ.3.8 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లు నెక్సాన్ EV, పంచ్ EV, టియాగో EV, హారియర్ EV, కర్వ్ EV లాంటి మోడళ్లపై అందిస్తోంది. ఈ తగ్గింపులు వెహికల్ మోడల్ ఇయర్, వేరియంట్, డీలర్‌ షిప్ దగ్గర అందుబాటులో ఉన్న స్టాక్‌పై ఆధారపడి ఉంటాయి.

⦿ టాటా నెక్సాన్ EV

టాటా నెక్సాన్ EVపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. MY24, MY25 మోడళ్లపై గరిష్టంగా రూ.1.2 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్ ఉన్నాయి. ఇప్పటికే టాటా కారు వాడుతున్న కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు. అయితే, కొత్త MY26 నెక్సాన్ EV మోడళ్లపై తగ్గింపులు సుమారు రూ.50 వేల వరకే పరిమితమయ్యాయి.

⦿ టాటా హారియర్ EV  

Advertisement

టాటా హారియర్ EVపై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. MY25, MY26 మోడళ్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్‌లతో పాటు ఇప్పటికే EV వాడుతున్న కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ బోనస్ ఇస్తున్నారు. ICE వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారే వారికి కూడా అదనపు ప్రయోజనాలు అందిస్తున్నారు.

⦿ టాటా టియాగో EV

ఈ మోడల్‌పై కంపెనీ భారీ తగ్గింపులు ప్రకటించింది. MY24, MY25 లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ.2.1 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇతర వేరియంట్లపై కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. MY26 మోడళ్లపై కూడా రూ.60 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు తగ్గింపులు అందిస్తోంది.

⦿ టాటా పంచ్ EV

Advertisement

ఈ మోడల్ కు సంబంధించి MY24, MY25 లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ.2.1 లక్షల వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. మిడ్ రేంజ్ వేరియంట్లపై రూ.1.9 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త MY26 మోడళ్లపై కూడా రూ.1.2 లక్షల నుంచి రూ.1.4 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది.

⦿ టాటా కర్వ్ EV

ఈ నెలలో ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ పొందుతున్న మోడల్ టాటా కర్వ్ EV. ఈ వాహనంపై గరిష్టంగా రూ.3.8 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా MY24, MY25 వేరియంట్లపై భారీ తగ్గింపులు ఉండటంతో కొనుగోలుదారుల ఆసక్తి చూపిస్తున్నారు. MY26 వేరియంట్లపై కూడా రూ.3.3 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ రన్నింగ్ ఖర్చులు, ప్రభుత్వ ఇన్సెంటివ్స్ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టైమ్ లో టాటా మోటార్స్ ప్రకటించిన భారీ తగ్గింపులు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.

Read Also: టాటా మెగా ప్లాన్.. మూడు కళ్లు చెదిరే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×