E-Paper
Advertisement

భారత మార్కెట్లోకి BSA స్క్రాంబ్లర్ 650 ఎంట్రీ, రాయల్ ఎన్ఫీల్డ్‌ కు ఇక చుక్కలే!

భారత మార్కెట్లోకి BSA స్క్రాంబ్లర్ 650 ఎంట్రీ, రాయల్ ఎన్ఫీల్డ్‌ కు ఇక చుక్కలే!
Advertisement

BSA Scrambler 650 Launched in India: భారత మార్కెట్లో BSA Scrambler 650 విడుదల అయ్యింది. ఈ మోడల్ లో BSA సంస్థ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కొత్త బైక్ క్లాసిక్ లుక్‌ తో పాటు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రైడర్లకు సరికొత్త ఎక్స్ పీరియెన్స్ అందించబోతోంది. ఈ బైక్ సంబంధించిన కొన్ని కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంజిన్ గురించి..

ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 652cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారు 45 bhp పవర్, 55 Nm టార్క్ ఇస్తుంది. ఐదు స్పీడ్ గేర్‌బాక్స్‌ తో వచ్చే ఈ ఇంజన్ సిటీ రైడింగ్‌కే కాకుండా ఆఫ్‌రోడింగ్‌కూ బాగా సరిపోతుంది. తక్కువ స్పీడ్ నుంచి మిడ్ రేంజ్ వరకు మంచి పికప్ ఇస్తుంది.

డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ పరంగా బాగా ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ క్లాసిక్ స్టైల్‌ ను ఆధునిక టచ్‌ తో కలిపి డిజైన్ చేశారు. ఎత్తుగా ఉన్న ఫ్రంట్ ఫెండర్, గేటర్లతో కూడిన ఫోర్క్స్, సింపుల్ సైడ్ ప్యానెల్స్, కలిపి రఫ్ అండ్ టఫ్ లుక్ ఇస్తాయి. పెద్దగా ఆకట్టుకునే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ఈ బైక్‌ కు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, అవసరమైన మోడ్రన్ టెక్నాలజీ ఇందులో ఉంది. LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, డ్యూయల్ ఛానల్ ABS వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా స్పీడ్, ఫ్యూయల్ లెవెల్ లాంటి సమాచారం సులభంగా చూడొచ్చు. ఇవన్నీ కలిపి ఈ బైక్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడానికి సాయపడుతాయి.

Advertisement

ఛాసిస్, సస్పెన్షన్ కూడా ఈ బైక్‌కు బలం. ముందువైపు 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల వైర్ స్పోక్ వీల్స్ ఉన్నాయి. ఇవి డ్యూయల్ పర్పస్ టైర్లతో వస్తాయి కాబట్టి, రోడ్డు మీద కూడా, కొద్దిగా ఆఫ్‌ రోడ్‌ లో కూడా సులభంగా నడపవచ్చు. టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్ మంచి కంఫర్ట్ ఇస్తాయి.

ధర ఎంత అంటే?

ధర పరంగా చూస్తే, ఈ బైక్ రూ. 3.25 లక్షల నుంచి రూ. 3.41 లక్షల వరకు లభిస్తుంది. రావెన్ బ్లాక్, విక్టర్ ఎల్లో, థండర్ గ్రే లాంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రతి కలర్ కూడా బైక్ లుక్‌ ను మరింత క్రేజీగా ఆకట్టుకునేలా చేస్తుంది. ఈ బైక్ క్లాసిక్ లుక్‌తో పాటు మంచి పనితీరు, అవసరమైన ఫీచర్లతో అలరిస్తుంది. సిటీ రైడింగ్‌తో పాటు కొంచెం అడ్వెంచర్ కూడా చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కు నేరుగా పోటీ చ్చే అవకాశం ఉంది.

Read Also: టాప్ రేంజ్ ఈవీ స్కూటర్స్, ఫుల్ ఛార్జ్ తో ఎన్ని వందల కి.మీ వెళ్లొచ్చంటే?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×