E-Paper
Advertisement

టాప్ రేంజ్ ఈవీ స్కూటర్స్, ఫుల్ ఛార్జ్ తో ఎన్ని వందల కి.మీ వెళ్లొచ్చంటే?

టాప్ రేంజ్ ఈవీ స్కూటర్స్, ఫుల్ ఛార్జ్ తో ఎన్ని వందల కి.మీ వెళ్లొచ్చంటే?
Advertisement

High Range EV Scooters in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గడం, పర్యావరణంపై అవగాహన పెరగడం లాంటి కారణాలతో చాలా మంది ఇప్పుడు EV స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లకు మంచి ఆదరణ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలిగే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ ఓలా S1 ప్రో

ఓలా S1 ప్రో ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఈ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 180 నుంచి 195 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పవర్‌ ఫుల్ మోటార్, వేగవంతమైన యాక్సిలరేషన్, ఆధునిక ఫీచర్లు ఆకట్టుకుంటాయి. పెద్ద టచ్‌ స్క్రీన్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

⦿ ఏథర్ 450X

Advertisement

ఏథర్ 450X స్కూటర్ పనితీరు, నమ్మకానికి ప్రసిద్ధి చెందింది. దీని రేంజ్ సుమారు 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రైడింగ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ చాలా బాగుంటాయి. సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్స్ ద్వారా కొత్త ఫీచర్లు అందిస్తారు. సిటీ రైడింగ్‌కు ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ టీవీఎస్ iQube ST

టీవీఎస్ iQube ST మంచి రేంజ్‌ తో పాటు ప్రాక్టికల్ ఫీచర్లను అందిస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌ తో సుమారు 145 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, వాయిస్ కమాండ్స్, కనెక్టివిటీ ఫీచర్లు మరింత మోడ్రన్ గా మారుస్తాయి. రోజువారీ ఉపయోగానికి ఇది సౌకర్యవంతమైన స్కూటర్.

⦿ బజాజ్ చేతక్ EV

Advertisement

ఇక బజాజ్ చేతక్ EV క్లాసిక్ డిజైన్‌ తో పాటు నమ్మకమైన పనితీరును కలిగి ఉంటుంది. దీని రేంజ్ సుమారు 120 నుంచి 130 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మెటల్ బాడీ, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇతర స్కూటర్లతో పోలిస్తే మంచి గుర్తింపు పొందింది. స్మూత్ రైడింగ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ సింపుల్ వన్

సింపుల్ వన్ స్కూటర్ రేంజ్ విషయంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ప్రస్తుతం అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్లలో ఒకటి. పవర్‌ఫుల్ పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు యంగ్ రైడర్స్‌ ను బాగా ఆకట్టుకునేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ వేగంగా పపెరుగుతోంది. రేంజ్, పనితీరు, టెక్నాలజీ విషయాల్లో కంపెనీలు పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా మెరుగైన రేంజ్, వేగం, సౌకర్యంతో కొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Read Also: ఆహా ఏం అమ్మకాలు భయ్యా.. ఈవీ సేల్స్ లో పంచ్, విండ్సర్ రికార్డ్!

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×