E-Paper
Advertisement

Tanveer Ahmed: క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్..ఐపీఎల్ ప‌రువు తీసిన త‌న్వీర్ అహ్మ‌ద్

Tanveer Ahmed: క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్..ఐపీఎల్ ప‌రువు తీసిన త‌న్వీర్ అహ్మ‌ద్

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 35కి పైగా మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Chennai Super Kings vs Gujarat Titans, 37th Match,) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదికగా జరగగా… ఓ వివాదంశం తెరపైకి వచ్చింది. గుజరాత్ బౌలర్ అర్షద్ ఖాన్ వేసిన నో- బాల్ (Arshad Khan no-ball ) సంఘ‌ట‌న‌కు సంబంధించిన పోస్టులు పెడుతున్నారు.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్..ఐపీఎల్ ప‌రువు తీసిన త‌న్వీర్ 

దీనికి సంబంధించిన పోస్టులు కూడా వైరల్ గా మారాయి. దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ అంటేనే దొంగల టోర్నమెంట్… ప్రతిదీ మ్యాచ్ ఫిక్సింగ్ ( Match fixing) అంటూ ఆరోపణలు చేశారు. నేను మొదటి నుంచి ఇదే చెబుతున్నా.. అయిన ఎవ్వడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అర్షద్ ఖాన్ వేసింది క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో-బాల్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ మధ్య 37వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పైన గుజరాత్ టైటాన్స్ విక్టరీ అందుకుంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 158 పరుగులు సాధించింది. అయితే ఈ క్రమంలో గుజరాత్ అద్భుతంగా ఆడి 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా అర్షద్ ఖాన్ 19 ఓవర్ వేశాడు. ఇందులో ఐదవ బంతిని నో-బాల్ వేశాడు అర్షద్ ఖాన్.

చెన్నై సూప‌ర్ కింగ్స్ న‌ష్ట‌పోయింది ఇక్క‌డే

కానీ అంపైర్ మాత్రం దీన్ని నో-బాల్ గా ప్రకటించలేదు. అయితే, ఈ బంతిని ఫోర్ కొట్టాడు ఓవ‌ర్ట‌న్‌. ఆ త‌ర్వాత వేసిన బంతికి ఔట్ అయ్యాడు. దీనివల్ల చెన్నై సూపర్ కింగ్స్ నష్టపోయింది. ముందుగానే 5వ బంతిని నో బాల్ గా ప్ర‌క‌టించి ఉంటే, నెక్ట్స్ బాల్ ఫ్రీ – హిట్ అయ్యేది, అప్పుడు ఓవ‌ర్ట‌న్ ఔట్ అయ్యేవాడు కాక‌పోవు. ఈ క్రమంలోనే తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ అంటేనే ఫిక్సింగ్ అంటూ వ్యాఖ్యానించారు. అర్షద్ ఖాన్ వేసిన బంతి… క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో-బాల్ అంటూ వ్యాఖ్యానించారు. కానీ గుజరాత్ టైటాన్స్కు అమ్ముడుపోయిన ఎంపైర్లు.. నోబాల్ ఇవ్వలేదని తన్వీర్ అహ్మద్ ఆరోపణలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్లో మొదటి నుంచి ఇదే తతంగం నడుస్తోందని బాంబు పేల్చారు.

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×