E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌ లో కారు కొనాలా? రూ. 5 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే!

తక్కువ బడ్జెట్‌ లో కారు కొనాలా? రూ. 5 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే!
Advertisement

Best Cars Under Rs. 5 Lakh in India: కారు కొనాలనేది చాలా మంది కోరిక. మన దేశంలో ఎక్కువ మంది కొనుగోలుదారులు ముందుగా బడ్జెట్‌ ను దృష్టిలో పెట్టుకుంటారు. తొలిసారి తక్కువ ధరలో కారు కొనుగోలు చేయాలనుకుంటారు. అలాంటి వారు ఇప్పుడు రూ. 5 లక్షల లోపు కూడా మంచి కార్లును కొనుగోలు చేసే అవకాశం ఉంది.  మారుతి సుజుకి, టాటా లాంటి కంపెనీలు తక్కువ ధరలో మంచి మైలేజ్, చక్కటి పనితీరు ఇచ్చే మోడళ్లను అందిస్తున్నాయి. రూ. 5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఏవనేది ఇప్పుడు చూద్దాం..

⦿ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

రూ. 5 లక్షల బడ్జెట్‌ లో మొదటగా గుర్తుకు వచ్చే కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒకటి. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, SUV లుక్‌ తో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు సిటీలో డ్రైవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే CNG ఆప్షన్ కూడా ఉండటంతో ఇంధన ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి  మంచి ఆప్షన్ గా ఉంటుంది.

Advertisement

⦿ మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి సుజుకి ఆల్టో K10 భారత మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి పనితీరు కారణంగా కొత్తగా కారు కొనేవారికి ఇది సేఫ్ ఛాయిస్‌గా ఉంటుంది. 1.0 లీటర్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు స్మూత్ డ్రైవింగ్  ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది.

⦿ రెనాల్ట్ క్విడ్

Advertisement

కొంచెం స్టైలిష్ లుక్ కావాలనుకునేవారికి రెనాల్ట్ క్విడ్ మంచి ఆప్షన్. ఇది SUV లాంటి డిజైన్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇతర కార్లతో పోలిస్తే కొద్దిగా పవర్ ఎక్కువగా ఉండే ఇంజిన్‌ తో వస్తుంది. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇది నగర ట్రాఫిక్‌ లో డ్రైవింగ్‌ ను మరింత ఈజీగా మార్చుతుంది.

⦿ టాటా టియాగో

కొంచెం ప్రీమియం ఫీల్ కావాలనుకునేవారికి టాటా టియాగో మంచి ఆప్షన్. ఈ కారు బిల్డ్ క్వాలిటీ, భద్రత విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మిగతా ఎంట్రీ లెవల్ కార్లతో పోలిస్తే ఇది కొంచెం బలంగా, స్థిరంగా ఉంటుంది. ఇంజిన్ కూడా మెరుగ్గా ఉండటం వల్ల డ్రైవింగ్ అనుభవం కాస్త కంఫర్ట్‌ గా ఉంటుంది.

⦿ మారుతి సుజుకి సెలెరియో

ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ కావాలనుకుంటే మారుతి సుజుకి సెలెరియో బెస్ట్ ఆప్షన్. ఇది మంచి మైలేజ్ ఇవ్వడంలో ముందుంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు గేర్‌ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులకు ఈజీగా ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

మొత్తంగా రూ. 5 లక్షల బడ్జెట్‌లో కూడా మంచి కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా సిటీలో డ్రైవ్ చేస్తారా? మైలేజ్ కావాలా? అనే అంశాలను బట్టి ఈ 5 కార్లలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

Read Also: కియా సెల్టోస్ To టాటా నెక్సాన్.. రూ.15 లక్షల్లోపు బెస్ట్ డీజిల్ ఆటోమేటిక్ SUVలు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×