E-Paper
Advertisement

కియా సెల్టోస్ To టాటా నెక్సాన్.. రూ.15 లక్షల్లోపు బెస్ట్ డీజిల్ ఆటోమేటిక్ SUVలు ఇవే!

కియా సెల్టోస్ To టాటా నెక్సాన్.. రూ.15 లక్షల్లోపు బెస్ట్ డీజిల్ ఆటోమేటిక్ SUVలు ఇవే!
Advertisement

Best Diesel Automatic SUVs Under Rs.15 Lakh: బడ్జెట్ ధరలో మంచి పనితీరు, సౌకర్యం, మైలేజ్ ఇచ్చే పలు డీజిల్ ఆటోమేటిక్ SUVలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ. 15 లక్షల లోపు సెగ్మెంట్‌ లో కొనుగోలుదారులకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయగలిగే ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో పాటు, డీజిల్ ఇంజన్ తో మెరుగైన ఇంధన సామర్థ్యం కూడా లభిస్తుంది. రూ. 15 లక్షల్లోపు బెస్ట్ ఆటోమేటిక్ డీజిలు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ కియా సోనెట్

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది కియా సోనెట్ గురించి. ఇది సబ్‌కాంపాక్ట్ SUVగా మంచి పేరు తెచ్చుకుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వడం వల్ల డ్రైవింగ్ సౌకర్యంగా ఉంటుంది. సన్‌ రూఫ్, సేఫ్టీ ఫీచర్లు, డిజిటల్ డిస్‌ ప్లే లాంటి అంశాలు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

⦿ టాటా నెక్సాన్

Advertisement

టాటా నెక్సాన్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVల్లో ఒకటి. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ మంచి మైలేజ్ ఇవ్వడమే కాకుండా, సేఫ్టీ విషయంలో కూడా మంచి గుర్తింపు పొందింది. పెద్ద టచ్‌ స్క్రీన్, కనెక్టివిటీ ఫీచర్లు, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు దీనిలో ఉన్నాయి.

⦿ మహీంద్రా XUV 3XO

మహీంద్రా XUV 3XO కూడా ఈ సెగ్మెంట్‌లో బలమైన పోటీ ఇస్తుంది. శక్తివంతమైన డీజిల్ ఇంజన్, మంచి టార్క్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ కలయికతో ఇది సిటీతో పాటు హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఆధునిక ఫీచర్లు, వైర్‌ లెస్ కనెక్టివిటీ, సన్‌ రూఫ్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

⦿ హ్యుందాయ్ వెన్యూ

Advertisement

హ్యుందాయ్ వెన్యూ డీజిల్ ఆటోమేటిక్ కూడా మరో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. సాఫ్ట్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్, మంచి మైలేజ్, స్టైలిష్ డిజైన్ దీని ప్రత్యేకతలు. ఇందులో ఉన్న టచ్‌ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, సేఫ్టీ ఫీచర్లు రోజువారీ వినియోగానికి సౌకర్యాన్ని ఇస్తాయి.

⦿ టాటా కర్వ్

టాటా కర్వ్ కొత్త తరహా కూపే SUVగా ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తుంది. డీజిల్ ఆటోమేటిక్ ఆప్షన్‌ తో పాటు ఆధునిక డిజైన్, టెక్నాలజీ ఫీచర్లు ఈ కారును ప్రత్యేకంగా మార్చాయి. డ్రైవింగ్  ఎక్స్ పీరియెన్స్, కంఫర్ట్ మధ్య మంచి బ్యాలెన్స్ ఇస్తుంది.

⦿ కియా సెల్టోస్

ఈ SUV ప్రీమియం ఫీలింగ్, స్పేస్, ఫీచర్లతో ముందుంటుంది. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ సాఫ్ట్ డ్రైవింగ్‌ తో పాటు మంచి పనితీరును అందిస్తుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, అడ్వాన్స్‌ డ్ సేఫ్టీ ఫీచర్లు దీని స్పెషల్ అట్రాక్షన్స్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికి, రూ. 15 లక్షల లోపు డీజిల్ ఆటోమేటిక్ SUVలు ఇప్పుడు మంచి ఆప్షన్ గా మారాయి.  సౌకర్యం, మైలేజ్, ఫీచర్లు కావాలనుకనే వారికి ఈ కార్లు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

Read Also: ఫ్యామిలీ భద్రతకు బెస్ట్ కార్లు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ టాప్ మోడల్స్ ఇవే!

 

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×