E-Paper
Advertisement

INCA Awards 2026: సత్తా చాటిన తెలుగు చిత్రాలు, నటీనటులు వీరే!

INCA Awards 2026: సత్తా చాటిన తెలుగు చిత్రాలు, నటీనటులు వీరే!
Advertisement

INCA Awards 2026:ముంబయి వేదికగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ 2026 వేడుకలో టాలీవుడ్ జెండా రెపరెపలాడింది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ దిగ్గజాల మధ్య మన తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులు సత్తా చాటారు. ముఖ్యంగా నాగచైతన్య, రష్మిక మందన్న, అనిల్ రావిపూడి వంటి వారు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుని వార్తల్లో నిలిచారు. అన్ని ఇండస్ట్రీలను ఏకం చేస్తూ నిర్వహించిన ఈ వేడుక ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

ముంబయిలో మెరిసిన సినీ తారలు..

సందడి చేసిన రానా, శ్రియ!:

Advertisement

ముంబయి నగరం గురువారం రాత్రి సినీ తళుకులీనింది. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఎన్‌సీఏ (INCA) ఈ అవార్డుల వేడుకను అట్టహాసంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, అందాల నటి శ్రియ శరణ్, బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అందరినీ అలరించారు. వీరి చమత్కారాలు, హోస్టింగ్ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సౌత్ నుంచి నార్త్ వరకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తండేల్’గా చైతన్య విశ్వరూపం.. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ!:

తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈసారి అవార్డుల పంట పండిందనే చెప్పాలి. ‘తండేల్’ సినిమాలో మత్స్యకారుడిగా అద్భుత నటన కనబరిచిన నాగచైతన్య ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆయన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన వినోదాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిన అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఇక ఇదే సినిమాలో ‘బుల్లిరాజు’ పాత్రతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకోవడం విశేషం. రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎంపికైంది.

ఇతర ఇండస్ట్రీల విజేతలు.. కమల్, రేఖలకు గౌరవం:

Advertisement

కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర భాషల నటులు కూడా ఈ వేడుకలో మెరిశారు. ‘కాంతారా చాప్టర్ 1’ తో రిషబ్ శెట్టి, ‘కాంత’ సినిమాతో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. సీనియర్ నటి సిమ్రన్, మలయాళ ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్ కూడా ఉత్తమ నటీమణులుగా నిలిచారు. ఇక భారతీయ సినిమాకు వారు చేసిన విశేష కృషికి గానూ విశ్వనటుడు కమల్ హాసన్, అలనాటి అందాల తార రేఖలకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కమల్‌కు అల్లు అరవింద్, రేఖకు కమల్ హాసన్ చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం ఆ వేడుకకే హైలెట్‌గా నిలిచింది.

also read:సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన అనన్య నాగళ్ల.. నెల సంపాదన తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే!

టెక్నికల్ విభాగంలో ‘మిరాయ్’ హవా.. కొత్త దర్శకులకు ఊతం!:

సాంకేతిక విభాగాల్లో కూడా తెలుగు సినిమాలే పైచేయి సాధించాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కు గానూ మరో అవార్డును సొంతం చేసుకుంది. కొత్త దర్శకులను ప్రోత్సహించే క్రమంలో ‘కోర్ట్’ సినిమాకు గానూ రామ్ జగదీష్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నిలిచారు. ఇలా అన్ని విభాగాల్లో తెలుగు ప్రతిభ వెలిగిపోవడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విజేతలకు అభినందనలు తెలుపుతున్నారు. జాతీయ స్థాయిలో ఐఎన్‌సీఏ అవార్డులు అందుకోవడం మన ఇండస్ట్రీకి గర్వకారణం.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×