E-Paper
Advertisement

Flying Cars: ఫ్లయింగ్ కార్లు రెడీ.. క్రేజీ న్యూస్ చెప్పిన XPeng!

Flying Cars: ఫ్లయింగ్ కార్లు రెడీ.. క్రేజీ న్యూస్ చెప్పిన XPeng!
Advertisement

Flying Cars Coming Soon: ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ CALB తాజాగా ఫ్లయింగ్ కార్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏవియేషన్ గ్రేడ్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించింది. భవిష్యత్ ట్రాన్స్‌ పోర్ట్ రంగంలో కీలక ముందడుగుకు కారణం అవుతుందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బ్యాటరీలు  XPeng కంపెనీకి చెందిన Aridge యూనిట్ డెవలప్ చేస్తున్నఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్(eVTOL) ఫ్లయింగ్ కార్ల కోసం రూపొందించబడ్డాయి. ఈ టెక్నాలజీతో కార్లు నేలపై నడవడమే కాకుండా, అవసరమైనప్పుడు గాల్లోకి ఎగరగలుగుతాయి.

తక్కువ బరువు.. ఎక్కువ పవర్ స్టోరేజ్!  

ఈ బ్యాటరీలను తయారు చేస్తున్న CALB సంస్థ కీలక వివరాలను వెల్లడించింది. ఈ బ్యాటరీలు చెంగ్డూ ప్లాంట్‌ లో తయారవుతున్నాయి. ఇవి సాధారణ కార్లలో ఉపయోగించే బ్యాటరీలతో పోలిస్తే చాలా అధునాతనంగా ఉంటాయి. అధిక సిలికాన్, నికెల్ కలిగిన సెల్స్‌ తో తయారవుతున్నాయి. దీంతో 360 Wh/kg వరకు పవర్ ను అందిస్తాయి. అంటే, తక్కువ బరువులో ఎక్కువ శక్తి స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫ్లయింగ్ కార్లకు అత్యంత కీలకం కాబోతోంది. ఇంకా, బ్యాటరీలు గరిష్టంగా 25C డిశ్చార్జ్ రేటును కలిగి ఉన్నాయి. అంటే తక్షణ శక్తి అవసరమైనప్పుడు వేగంగా పవర్ అందిస్తాయి. ఫ్లయింగ్ సమయంలో ఈ విధానం చాలా అవసరం అవుతుంది.

భద్రతా పరీక్షల్లోనూ పాస్!

Advertisement

భద్రత విషయంలోనూ ఈ బ్యాటరీలు మంచి సక్సెస్ రేట్ సాధించాయి. 15.2 మీటర్ల ఎత్తు నుంచి పడేసినా ఇవి ఎలాంటి డ్యామేజ్ కాలేదు. మంటలు అంటుకోలేదు. లీక్ కాలేదు. ఇది విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ ఫీచర్ ఫ్లయింగ్ కార్లను మరింత సురక్షితంగా మార్చడంలో సాయపడుతుంది.

X3-F మోడల్ ఫ్లయింగ్ కారులో వినియోగం

అటు ఈ బ్యాటరీలు Aridge అభివృద్ధి చేస్తున్న X3-F మోడల్ ఫ్లయింగ్ కారులో ఉపయోగించనున్నారు. ఇది ఒక మాడ్యులర్ ల్యాండ్ ఎయిర్ వాహనం. అంటే, రోడ్డు మీద కార్‌ లా నడిచే ఈ వాహనం, అవసరమైనప్పుడు ఎయిర్‌ క్రాఫ్ట్‌ గా మారి గాల్లోకి ఎగురుతుంది. Aridge సంస్థను 2013లో ప్రారంభించి, 2020లో అధికారికంగా స్థాపించారు. దీనిలో XPeng కంపెనీతో పాటు దాని CEO He Xiaopeng ప్రధాన వాటా కలిగి ఉన్నారు. ఈ కంపెనీ 2026 నాటికి ఈ ఫ్లయింగ్ కార్లను భారీగా తయారు చేసి మార్కెట్‌ లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ఫ్లయింగ్ కారు ధర  దాదాపు $290,000 అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2.4 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

ఇక చైనా బ్యాటరీ మార్కెట్ విషయానికి వస్తే, ప్రస్తుతం CATL , BYD లాంటి దిగ్గజ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయినప్పటికీ, CALB లాంటి సంస్థలు కొత్త టెక్నాలజీలతో మార్కెట్‌ లో తమ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫ్లయింగ్ కార్ల కోసం ప్రత్యేక బ్యాటరీల ఉత్పత్తి ప్రారంభం కావడం, భవిష్యత్ రవాణా రంగంలో పెద్ద మార్పులకుకారణం కానుంది. మరికొద్ది సంవత్సరాల్లోనే కార్లను రోడ్ల మీద మాత్రమే కాకుండా ఆకాశంలో చూసే అవకాశం ఉంది.

Read Also: వెహికల్ కలర్ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతుందా? కచ్చితంగా ఈ విషయం తెలియాల్సిందే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×