E-Paper
Advertisement

Tecno Spark 50 5G: సిగ్నల్ లేకున్నా కాల్స్.. పిక్సెల్ రేంజ్ లుక్.. రూ.10వేల లోపే టెక్నో సరికొత్త స్మార్ట్‌ఫోన్!

Tecno Spark 50 5G: సిగ్నల్ లేకున్నా కాల్స్.. పిక్సెల్ రేంజ్ లుక్.. రూ.10వేల లోపే టెక్నో సరికొత్త స్మార్ట్‌ఫోన్!
Advertisement

Tecno Spark 50 5G: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో.. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, అత్యాధునిక ఫీచర్లతో కూడిన Tecno Spark 50 5Gని భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అమెజాన్‌లో దీనికి సంబంధించిన ప్రచారం ఇప్పటికే మొదలవ్వడంతో, టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా ఖరీదైన ఫోన్లలో మాత్రమే కనిపించే స్టైలిష్ హారిజాంటల్ కెమెరా బార్ డిజైన్‌ను ఈ ఫోన్‌లో ప్రవేశపెట్టడం ద్వారా, తక్కువ ధరలోనే లగ్జరీ లుక్‌ను టెక్నో అందించబోతోంది.

నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్:

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని భారీ 6,500mAh బ్యాటరీ. నిరంతరం ప్రయాణాల్లో ఉండేవారికి, ఛార్జింగ్ పెట్టుకునే వీలులేని వారికి ఇది బెటర్ ఆప్షన్. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో, అతి తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర బడ్జెట్ ఫోన్లతో పోలిస్తే.. ఈ బ్యాటరీ సామర్థ్యం సాధారణ వినియోగదారులకు అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది.

Advertisement

Also Read: వావ్, రూ.వెయ్యి లోపు ‘ఫీచర్ ఫోన్లు’ చూశారా? UPI పేమెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

యువతను ఆకట్టుకునేలా క్లాసీ లుక్:

కేవలం ఫీచర్లు మాత్రమే కాదు.. ఫోన్ మన్నిక విషయంలో కూడా టెక్నో ఎక్కడా తగ్గలేదు. ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉండటం వల్ల, ప్రమాదవశాత్తు 1.5 మీటర్ల ఎత్తు నుండి కింద పడినా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఫాంటసీ పర్పుల్, మింట్ గ్రీన్ వంటి 4 విభిన్న రంగుల్లో లభిస్తున్న ఈ స్లిమ్ డిజైన్ ఫోన్, యువతను విశేషంగా ఆకట్టుకోనుంది. పాత తరహా డిజైన్లతో బోర్ కొట్టిన వారికి ఈ కొత్త లుక్ కచ్చితంగా నచ్చుతుంది.

సిగ్నల్ లేకున్నా కాల్స్ మాట్లాడొచ్చు:

Advertisement

ఈ టెక్నో స్పార్క్ 50 5Gలో అత్యంత వినూత్నమైన ఫీచర్ ఏమిటంటే.. సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వరకు మాట్లాడుకోగలిగే వెసులుబాటు. ఇది అత్యవసర సమయాల్లో వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఉన్న UPS 3.0 టెక్నాలజీ వల్ల నెట్‌వర్క్ వేగం పెరిగి, డిజిటల్ పేమెంట్లు రెండు రెట్లు వేగంగా పూర్తవుతాయి. మార్చి 27న విడుదల కానున్న ఈ ఫోన్, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీనిచ్చేలా ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: మీ ఇంటి సీలింగ్‌కే ఏసీ.. లివింగ్ రూమ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్, ధర ఎంతంటే?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×