E-Paper
Advertisement

Uncomfortable Front Seat Cars: అన్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు ఇవే.. కొనేటప్పుడు కాస్త జాగ్రత్త!

Uncomfortable Front Seat Cars: అన్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు ఇవే.. కొనేటప్పుడు కాస్త జాగ్రత్త!
Advertisement

Uncomfortable Front Seat Cars In India: కారు ప్రయాణం కంఫర్ట్ గా ఉండాలి. అలా కాకుండా లక్షల రూపాయలు పోసి కొనుగోలు చేసిన కార్లు అసౌకర్యంగా ఉంటే చిరాకేస్తుంది. నిజానికి కార్ల ముందు సీట్ల సౌకర్యం అనేది సబ్జెక్టివ్, వ్యక్తి ఎత్తు, బరువు, డ్రైవింగ్ స్టైల్ బట్టి మారుతుంది. అయితే, యూజర్ రివ్యూలు, ఎక్స్‌ పర్ట్ ఒపీనియన్స్, ఓనర్ ఫీడ్‌ బ్యాక్ ఆధారంగా, బడ్జెట్, ఎంట్రీ లెవల్ కార్లలో కొన్ని మోడల్స్ ముందు సీట్ల విషయంలో కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా తక్కువ ప్యాడింగ్, పూర్ లంబార్ సపోర్ట్, స్టిఫ్ కుషనింగ్, తక్కువ థై సపోర్ట్ వంటి సమస్యలు ఉంటాయి. ఇంతకీ ఇండియాలో ఉన్న అన్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ వోక్స్ వ్యాగన్ పోలో  

వోక్స్ వ్యాగన్ పోలో  కారులో లోయర్ బ్యాక్ సపోర్ట్ దాదాపు లేదు. లాంగ్ డ్రైవ్స్‌ లో వెన్ను నొప్పి వస్తుంది. హార్డ్ సీట్లు, తక్కువ అడ్జస్టబిలిటీ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఓనర్లు యాడ్ ఆన్ లంబార్ సపోర్ట్ వాడుతున్నారు. ప్రస్తుతం ఈ కార్లు డిస్ కంటిన్యూ అయ్యాయి. సెకెండ్ హ్యాండ్ కార్లు రూ. 4-8 లక్షలు ఉంటాయి.

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

Advertisement

ఈ కారు సీట్లు థిన్ ప్యాడింగ్‌ తో ఉంటాయి. లాంగ్ జర్నీల్లో అసౌకర్యం, వెన్ను నొప్పి కలుగుతుంది. కొందరు ఓనర్లు హార్డ్,  అన్‌కంఫర్టబుల్ అని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ కారు ధర రూ. 6-9 లక్షలు  ఉంటుంది.

⦿ మహీంద్రా బొలేరో

ఈ కారులో ముందు సీట్లు నా, తక్కువ సపోర్ట్ తో ఉంటాయి. క్రూడ్ డిజైన్ కారణంగా లాంగ్ డ్రైవ్స్‌ లో అలసట కలుగుతుంది. ఆఫ్ రోడ్ ఫోకస్‌తో రూరల్ యూజ్ కోసం డిజైన్, కంఫర్ట్ ప్రాధాన్యత తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఈ కారు ధర రూ. 9-11 లక్షలు ఉంటుంది.

⦿ రెనాల్ట్ క్విడ్

Advertisement

ఈ కారు సీట్లు థిన్, ఫ్లాట్, తక్కువ ప్యాడింగ్ వల్ల లాంగ్ ట్రిప్స్‌ లో అసౌకర్యంగా ఉంటుంది.  ఎంట్రీ లెవల్ బడ్జెట్ కారు, కాస్ట్ సేవింగ్ వల్ల ఇలా తయారయ్యాయి. షార్ట్ డ్రైవ్స్‌ కి ఓకే కానీ హైవేలో సమస్య ఏర్పడుతుంది. ఈ కారు ధర రూ. 4.7-6 లక్షలు ఉంటుంది.

⦿ ఫోర్డ్ ఎకో స్పోర్ట్

ఈ కారులో సీట్లు స్టిఫ్, తక్కువ థై సపోర్ట్, లాంగ్ డ్రైవ్స్‌ లో ఫ్యాటిగ్ ఏర్పడుతుంది. థిక్ కుషన్స్ వెన్నులోకి గుచ్చేలా ఉంటాయి. ప్రస్తుతం ఈ కార్లు డిస్ కంటిన్యూ అయ్యాయి. సెకెండ్ హ్యాండ్ కార్లు రూ. 5-9 లక్షల్లో అందుబాటులో ఉంటాయి.

అటు మరుతి సుజుకి సియాజ్ లోనూ ముందు సీట్లు చాలా అసౌకర్యంగా ఉంటాయనే రివ్యూలు ఉన్నాయి. మహీంద్రా థార్ లోనూ ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ రోడ్ ఫోకస్ వల్ల సీట్లు ఫ్లాట్, అన్‌సపోర్టివ్, పెడల్ ప్లేస్‌మెంట్ వింతగా ఉంటుంది. ఈ కంప్లైంట్స్ ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ కార్లలోనే ఉన్నాయి. ప్రీమియం కార్ల ముందు సీట్లలో మంచి కంఫర్ట్ ఇస్తాయి.

Read Also: వోల్వో XC40 Vs XC60.. ఈ రెండు లగ్జరీ కార్లలో తేడాలేంటో తెలుసా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×