E-Paper
Advertisement

Volvo XC40 Vs Volvo XC60: వోల్వో XC40 Vs XC60.. ఈ రెండు లగ్జరీ కార్లలో తేడాలేంటో తెలుసా?

Volvo XC40 Vs Volvo XC60: వోల్వో XC40 Vs XC60.. ఈ రెండు లగ్జరీ కార్లలో తేడాలేంటో తెలుసా?
Advertisement

Volvo XC40 Vs Volvo XC60: స్వీడన్ కు సంబంధించి లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇప్పటికే పలు లగ్జరీ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో లేటెస్ట్ మోడల్స్ XC40, XC60.  ఇవి రెండూ లగ్జరీ SUVలుగా మార్కెట్లోకి అడుగు పెట్టాయి. కానీ,  సైజు, పెర్ఫార్మెన్స్, ధరల విషయంలో తేడాలు ఉన్నాయి. XC40 కాంపాక్ట్ SUV ఇప్పుడు మైల్డ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ EX40గా అందుబాటులో ఉంది. XC60 మిడ్ సైజ్ SUV మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ లో లభిస్తుంది. 2026 జనవరి నాటికి ఈ రెండు కార్ల మధ్య ఉన్న కీలకమైన పోలికలు, కంప్లీట్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందా..

వోల్వో XC40, XC60 ధరలు

⦿ Volvo XC40:  మైల్డ్ హైబ్రిడ్, సింగిల్ వేరియంట్ B4 అల్టిమేట్ ధర రూ.46.40 లక్షలుగా ఉంది. ఎలక్ట్రిక్ EX40  ధర రూ. 49 లక్షల నుంచి రూ. 59 లక్షలు ఉంది. .

Advertisement

⦿ Volvo XC60: సింగిల్ వేరియంట్ B5 అల్ట్రా మైల్డ్ హైబ్రిడ్ ధర రూ. 68.10 లక్షల నుంచి రూ. 71.90 లక్షలుగా ఉంది. . XC60 XC40 కంటే రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు ఎక్కువ ధరను కలిగి ఉంది.

వోల్వో XC40, XC60 డైమెన్షన్లు, స్పేస్

⦿ XC40: ఈ కారు లెంగ్త్ 4425 ఎంఎం, వీల్‌ బేస్ 2702 ఎంఎం, బూట్ స్పేస్ 452 లీటర్లు ఉంటుంది. కాంపాక్ట్, సిటీ డ్రైవింగ్‌కు ఈజీగా ఉంటుంది. పార్కింగ్ కూడా సులభంగా ఉంటుంది.

Advertisement

⦿ XC60: లెంగ్త్ 4708 ఎంఎం, వీల్‌బేస్ 2865 ఎంఎం, బూట్ స్పేస్ 483 లీటర్లు ఉంటుంది. ఎక్కువ స్పేస్, ఫ్యామిలీ లాంగ్ ట్రిప్‌ లకు మంచిది. రియర్ లెగ్‌ రూమ్ ఎక్కువగా ఉంటుంది.

వోల్వో XC40, XC60 ఇంజిన్, పెర్ఫార్మెన్స్

⦿ XC40  మైల్డ్-హైబ్రిడ్: 2.0L టర్బోపెట్రోల్, 48V, 197 bhp, 300 Nm, AWD, 0-100 కిలో మీటర్ల వేగం కేవలం 7.5 సెకన్లలో అందుకుంటుంది. మైలేజ్ లీటర్ కు 14 కిలో మీటర్లు ఇస్తుంది.

⦿ XC60: 2.0L టర్బో పెట్రోల్, 48V మైల్డ్ హైబ్రిడ్, 250 bhp, 350-360 Nm, AWD, 6.9 సెకెన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మైలేజ్ లీటర్ కు 13 కిలో మీటర్లు ఇస్తుంది. XC60 ఎక్కువ పవర్‌ ఫుల్, స్మూత్ డ్రైవింగ్ ను అందిస్తుంది.

Read Also: సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? కచ్చితంగా ఇవి చెక్ చేయాల్సిందే!

వోల్వో XC40, XC60 ఫీచర్లు, సేఫ్టీ

ఈ రెండు కార్లలోనే ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. LED లైట్స్, పనోరమిక్ సన్‌ రూఫ్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ప్రీమియం ఆడియో, హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, ADAS వ్యవస్థ ఉంటుంది. XC60 కాస్త ఎక్కువ లగ్జరీగా ఉంటుంది. బెటర్ ఆడియో, మసాజ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటాయి. ఈ రెండు కార్లు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్, మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్, 360° కెమెరాను కలిగి ఉన్నాయి.

⦿ XC40: సిటీ యూజ్, సోలో, స్మాల్ ఫ్యామిలీ అనుకూలంగా ఉంటుంది. తక్కువ ధర, ఈజీ హ్యాండ్లింగ్ అవకాశం ఉంటుంది.

⦿ XC60: ఎక్కువ స్పేస్, పవర్, లగ్జరీ ఫీల్, లాంగ్ ట్రిప్‌లు కావాలంటే దీన్ని తీసుకోవడం బెటర్.

Read Also: ఒక్క ఛార్జ్ తో 150 కి.మీ రేంజ్, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదుర్స్ అంతే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×