E-Paper
Advertisement

KCR: కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి వస్తారా? ఆ మాటలకు అర్థం అదేనా?

KCR: కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి వస్తారా? ఆ మాటలకు అర్థం అదేనా?
Advertisement

KCR: అసెంబ్లీ శీతాకాల సహావేశాల్లో అలా కనిపించి వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌ నందినగర్ నివాసం నుండి ఎర్రవెల్లికి చేరుకున్న కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్న కేసీఆర్ కున్నారంట. ఆ క్రమంలో 2 తేదీన తిరిగి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.. అయితే కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్‌కు వెళ్ళడంతో లాబీ దళంలో తీవ్ర నిరాశనిస్పృహలు వ్యక్తమవుతున్నాయంట.

తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్

Advertisement

డిసెంబర్ 20న ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసానికి వచ్చిన గులాబీబాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. 21న తెలంగాణభవన్‌లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి తానిచ్చిన సమయం ముగిసిందని చెప్పడమే కాకుండా ..తోలు తీస్తాం.. అడుగడుగునా నిలదీస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపాయి. దాదాపు రెండేళ్ల పాటు రాజకీయంగా పూర్తి నైరాశ్యంతో గడుపుతున్న గులాబీ శ్రేణుల్లో బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు మీడియాకు ముందుకు రావడం, అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపేలా మాట్లాడటంతో ఉత్సాహం కనిపించింది.

29న అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాజీ సీఎం

Advertisement

అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు.. కేసీఆర్ సభకు రావడంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా జరుగుతాయని అందరూ భావించారు. అయితే సభలో ఐదు నిమిషాలు మాత్రమే ఉన్న కేసీఆర్ హాజరు కోసం అన్నట్లు రిజిస్ట్రర్‌లో సంకతం చేసి వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి తిరిగి నంది నగర్‌లోని నివాసానికి వెళ్లిపోయారు.

రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయిన గులాబీ బాస్

జనవరి 2వ తేదీన తిరిగి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. కేసీఆర్ ఆ రోజు సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సోమవారం ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన కేసీఆర్.. 2వ తేదీన జరిగే సమావేశానికి వస్తారని ఆ పార్టీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ సవాల్ విసిరినట్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం చర్చకు ముందుకు వచ్చిన రోజున … కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రెండేళ్ల తర్వాత తాను క్రియాశీలమవుతున్నట్లు స్వయంగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సాగునీటి రంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.

2 లేదా 3వ తేదీల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?

ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడితే ఎదుర్కొడానికి సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. కృష్ణ పరివాహక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు ఈ మేరకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విపక్ష నేతపై ఎదురుదాడికి సిద్దంగా ఉండాలని పార్టీ నేతలను సన్నద్దం చేశారంట. ఈ నేపథ్యంలో విపక్ష నేత కేసీఆర్ 2 లేదా 3వ తేదీల్లో సభకు వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, గత ప్రభుత్వాల ప్రతిపాదనలు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి వల్ల రెండు జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరగనుందో కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. మరి అందరూ ఎదురు చూస్తున్నట్లు గులాబీ దళపతి సభకు వచ్చి ఆ టాపిక్‌లపై మాట్లాడతారో? లేకపోతే తిరిగి ఫాంహౌస్‌కే పరిమితమవుతారో చూడాలి.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×