E-Paper
Advertisement

CAT 2.0 Electric Scooter: కమర్షియల్ యూజ్ కు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ధర కూడా తక్కువే!

CAT 2.0 Electric Scooter: కమర్షియల్ యూజ్ కు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ధర కూడా తక్కువే!
Advertisement

CAT 2.0 Electric Scooter: CAT 2.0 కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్‌ లో బాగా ప్రజాదరణ పొందుతోంది.  ముఖ్యంగా డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారులకు ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇరాన్ యుద్ధం కారణంగా  పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేయలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో, ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో CAT 2.0 ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

కమర్షియల్ ఉపయోగం కోసం డిజైన్

ఈ స్కూటర్ ప్రత్యేకంగా కమర్షియల్ ఉపయోగం కోసం డిజైన్ చేశారు. రోజంతా ఎక్కువ రన్నింగ్ ఉన్నా ఇది సులభంగా పని చేస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ బలంగా ఉంటుంది. ఎక్కువ బరువు మోయగలిగేలా తయారు చేశారు. అందుకే ఫుడ్ డెలివరీ, కూరియర్ సర్వీసులు, ఈ కామర్స్ డెలివరీల కోసం చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారు.

ఒకే ఛార్జ్ తో 120 కి.మీ ప్రయాణం

Advertisement

CAT 2.0 బ్యాటరీ విషయానికి వస్తే.. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే మంచి రేంజ్ ఇస్తుంది. సాధారణంగా ఒకసారి చార్జ్ తో 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రోజువారీ అవసరాలకు సరిపోతుంది. బ్యాటరీని ఇంట్లోనే సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. స్కూటర్ స్పీడ్ కూడా బాగానే ఉంటుంది. ఇది హై స్పీడ్ కోసం కాకుండా,   సేఫ్‌ గా ప్రయాణించడానికి డిజైన్ చేశారు. నగర ట్రాఫిక్‌ లో కూడా సులభంగా నడపవచ్చు. ఎలాంటి సౌండ్ లేకుండా ప్రశాంతంగా వెళ్లవచ్చు.

చాలా సింపుల్, ప్రాక్టికల్‌..    

డిజైన్ పరంగా చూస్తే, ఇది చాలా సింపుల్, ప్రాక్టికల్‌ గా ఉంటుంది. పెద్దగా ఆకర్షణీయమైన లుక్స్ కాకపోయినా, రోజువారీ ఉపయోగాలకు అనుగుణంగా రూపొందించారు. పెద్ద సీటు, మంచి ఫుట్‌ బోర్డ్ స్పేస్, సరుకులు పెట్టుకునే సదుపాయం ఉంటుంది. కమర్షియల్ వాడుకకు ఇవి చాలా బాగుంటాయి.  మరొక ముఖ్యమైన విషయం ఖర్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో..  ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువగా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని వాడటం ద్వారా నెలకు మంచి సేవింగ్స్ పొందవచ్చు. సేఫ్టీ పరంగా మంచి ఫీచర్లు ఉన్నాయి. బలమైన బ్రేకులు, స్టేబుల్ బాడీ, మంచి గ్రిప్ ఉన్న టైర్లు ఉంటాయి.

ధర ఎంత అంటే?

Advertisement

CAT 2.0 బేసిక్ మోడల్ ధర సుమారు రూ. 54,999 ఉంటుంది. టాప్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షల వరకు ఉంటుంది. CAT 2.0 కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రోజు వారీ సరుకులు మోసుకెళ్లేందుకు చాలా బాగుంటుంది. తక్కువ ఖర్చు, మంచి రేంజ్, సులభమైన మెయింటెనెన్స్, ప్రాక్టికల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

Read Also: ఇక టోల్ గేట్ దగ్గర ఆడాల్సిన అవసరం లేదు, నేరుగా వెళ్లిపోవచ్చు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×