E-Paper
Advertisement

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
Advertisement

Citroen eC3 Facelift Teased: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్లో తన eC3 ఎలక్ట్రిక్ కారు ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అధికారిక లాంచ్‌కు ముందు కంపెనీ ఈ మోడల్‌ ను టీజ్ చేసింది. గత ఏడాది C3 హ్యాచ్‌ బ్యాక్‌ కు అప్‌ డేటెడ్ వెర్షన్ తీసుకొచ్చిన సిట్రోయెన్, ఇప్పుడు అదే తరహా మార్పులను eC3లో కూడా అందించనుంది.

డిజైన్, ఫీచర్ల పరంగా కీలక మార్పులు

కొత్త eC3లో భారీ మార్పులు కాకపోయినా, డిజైన్, ఫీచర్ల పరంగా కొన్ని ముఖ్యమైన అప్‌ డేట్స్ ఉండనున్నాయి. ముఖ్యంగా ముందు భాగంలో LED హెడ్‌ ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్, కొత్త బంపర్ డిజైన్ కనిపించే అవకాశం ఉంది. అలాగే కొత్త వీల్ డిజైన్లు, కొత్త కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి రావచ్చు. అయితే, కారు సైజులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ఇంటీరియర్ గురించి..

Advertisement

ఎక్కువ అప్‌ డేట్లు క్యాబిన్‌ లోనే కనిపించే అవకాశం ఉంది. అప్‌ డేటెడ్ C3లో వచ్చిన 7-అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను eC3లో కూడా అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా టాప్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ IRVM, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు లాంటి ఆధునిక ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంటుంది.

డిజైన్ పరంగా డ్యాష్‌ బోర్డ్ లే అవుట్‌ లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న మోడల్‌ లోని స్టైలిష్ AC వెంట్లు, ప్రత్యేక డ్యాష్‌ బోర్డ్ డిజైన్ కొనసాగనున్నాయి. అలాగే 10.2 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫ్యాబ్రిక్ సీట్లు లాంటి ఫీచర్లు కూడా యథాతథంగా ఉండే అవకాశముంది.

పవర్ ట్రెయిన్ గురించి..

Advertisement

పవర్‌ ట్రెయిన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 29.2kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్‌ ను కొనసాగించనున్నారు. ఈ మోటార్ 57 హెచ్‌ పీ పవర్, 143 ఎన్ఎ మ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కారు గరిష్టంగా గంటకు 107 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రేంజ్ విషయానికి వస్తే, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 246 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కారు 3.3kW AC ఛార్జర్‌ తో అందుబాటులో ఉంది. ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌లో కూడా ఇదే సెటప్ కొనసాగే అవకాశం ఉంది.

సిట్రోయెన్ eC3 ధరల గురించి..

ప్రస్తుతం సిట్రోయెన్ eC3 ధరలు రూ.11.99 లక్షల నుంచి రూ.13.26 లక్షల వరకు ఉంటుంది. ఈ ఏడాది చివరలో విడుదలయ్యే ఫేస్‌ లిఫ్ట్ మోడల్ ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది టాటా టియాగో EV, MG కామెట్ EV వంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది.

Read Also: టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×