E-Paper
Advertisement

Automatic to Manual Car: ఆటో మేటిక్ కారును మాన్యువల్ కారుగా మార్చుకోవాలా? సింపుల్ గా ఇలా చేస్తే సరి!

Automatic to Manual Car: ఆటో మేటిక్ కారును మాన్యువల్ కారుగా మార్చుకోవాలా? సింపుల్ గా ఇలా చేస్తే సరి!
Advertisement

కార్లకు సంబంధించి ట్రాన్స్ మిషన్ మార్పులు అనేవి కామన్ అయ్యాయి. మాన్యువల్ కారును ఆటోమేటిక్ గా, ఆటోమేటిక్ కార్లను మాన్యువల్ గా మార్చుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మనం ఆటోమేటిక్ కారును మాన్యువల్ కారుగా ఎలా మార్చాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ ప్రక్రియ అనేది సంక్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న టెక్నికల్ విధానం. దీనికి ట్రాన్స్‌ మిషన్‌ ను పూర్తిగా మార్చడం, క్లచ్ పెడల్ అమర్చడం, గేర్ లింకేజ్ మార్చడం, ECU రీప్రోగ్రామింగ్ లాంటి పనులు అవసరం. ఈ మార్పిడి ప్రక్రియకు సాధారణంగా రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

ఆటోమేటిక్ నుంచి మాన్యువల్‌గా మార్చే విధానం

⦿ ట్రాన్స్‌ మిషన్ మార్పిడి: ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ను పూర్తిగా తొలగించి, మాన్యువల్ గేర్‌ బాక్స్‌ ను అమర్చాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని.

Advertisement

⦿ క్లచ్, పెడల్స్: ఈ ప్రక్రియలో క్లచ్ పెడల్ ను అమర్చాల్సి ఉంటుంది. బ్రేక్ పెడల్‌ ను మార్చడానికి క్లచ్ కేబుల్, డ్రాలిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా కష్టమైన పని.

⦿ ఫ్లైవీల్, లింకేజ్: మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్‌కు సరిపోయే ఫ్లైవీల్, క్లచ్ అసెంబ్లీ, గేర్ షిఫ్ట్ మెకానిజంను అమర్చాలి.

Advertisement

⦿ ECU రీమ్యాపింగ్: కారు కంప్యూటర్ (ECU) ఆటోమేటిక్ గేర్ సిస్టమ్‌ను గుర్తించేలా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ సరిగ్గా పనిచేయడానికి ECUని రీమ్యాప్ చేయాల్సి ఉంటుంది.

⦿ ఇంటీరియర్ మార్పులు: సెంటర్ కన్సోల్ ను మార్చాల్సి ఉంటుంది. అటు క్లచ్ పెడల్ కోసం డ్యాష్‌ బోర్డ్ కింద మార్పులు కూడా అవసరం అవుతాయి.

మాన్యువల్‌గా మార్చేటప్పుడు గమనించాల్సిన విషయాలు

⦿ ఆటోమేటిక్ నుంచి మాన్యువల్ గా మార్చేటప్పుడు ఖర్చు చాలా అవుతుంది.

⦿ ఇక మాన్యువల్ గా మార్చిన తర్వాత రీసేల్ వ్యాల్యూ తగ్గే అవకాశం ఉంది.

⦿ చాలా సందర్భాలలో ఆటోమేటిక్ కారును అమ్మి, నేరుగా మాన్యువల్ కారును కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తుంటారు.

⦿ ట్రాన్స్ మిషన్ మార్పిడి కోసం గుర్తింపు పొందిన మెకానిక్, వర్క్‌ షాప్‌ను సంప్రదించడం మంచిది.

చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ..

ఆటో మేటిక్ కారును మాన్యువల్ కారుగా మార్చడం ప్రత్యేక వర్క్‌ షాప్‌ల ద్వారా సాధ్యమవుతుంది. ముందుగానే ప్రణాళిక, బడ్జెట్ ను చూసుకోవాలి. మాన్యువల్ గా మారే సమయంలో చట్టపరమైన నిబంధనలకు లోబడి మార్పులు ఉండాలి. ఆ నిబంధనలు ఏంటనేవి ముందే, ఆర్టీఓ అధికారులను సంప్రదించి అందుకు అనుగుణమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కన్వర్షన్ తర్వాత వాహనం భద్రత, రెడ్ వర్తీనెస్ కోసం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు మార్పుల గురించి చెప్పాలి. కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ను కూడా అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×