E-Paper
Advertisement

Invalid Flight Ticket: ఫ్లిప్‌ కార్ట్ లో ప్లైట్ టికెట్ బుకింగ్, తీరా ఎయిర్ పోర్టుకు వెళ్లాక షాక్!

Invalid Flight Ticket: ఫ్లిప్‌ కార్ట్ లో ప్లైట్ టికెట్ బుకింగ్, తీరా ఎయిర్ పోర్టుకు వెళ్లాక షాక్!
Advertisement

Flipkart Invalid Flight Ticket:  ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫారమ్‌లు తరచుగా బస్సులు, రైళ్లు, విమానాల టికెట్ బుకింగ్‌లపై మంచి డిస్కౌంట్లను అందిస్తాయి. అందుకే, చాలా మంది ఆ సైట్ల నుంచి టికెట్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరకు ట్రావెల్ చేస్తారు. కానీ, తక్కువ ధరలకు టికెట్లను ప్రయత్నంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి అలాగే ఫ్లిప్‌ కార్ట్ లో ప్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్ పోర్టుకు వెళ్లాక అది చెల్లదని చెప్పడంతో షాకయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా ఎక్స్ లో తను పెట్టిన పోస్టులో కీలక విషయాలు వెల్లడించాడు.  ఫ్లిప్‌ కార్ట్ ద్వారా బుక్ చేసుకున్న విమాన టికెట్ తన షెడ్యూల్ చేసిన ప్రయాణానికి ఒక రోజు ముందు చెల్లదని తెలిసిందన్నాడు. బుకింగ్ గురించి ఎయిర్‌ లైన్ దగ్గర ఎలాంటి సమాచారం లేదన్నాడు. ప్లాట్‌ ఫారమ్ కస్టమర్ సపోర్ట్ సాయం చేయలేకపోయిందని ఆరోపించాడు. “త్వరలో నా విమాన ప్రయాణం ఉంది. @Flipkart నాకు చెల్లని టికెట్ (PNR N7ADZE) అమ్మింది. ఎయిర్‌ లైన్ (@Vietjetindia) దగ్గర నా గురించి ఎలాంటి రికార్డు లేదు. ఫ్లిప్‌ కార్ట్ సాయం కోరుతున్నాను. నేను సమస్యలో ఇరుక్కుపోయాను. దయచేసి హెల్ప్ చేయండి” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

Advertisement

డిసెంబర్ 24న ఉదయం 00:05 గంటలకు ఢిల్లీ నుంచి వియత్నాంలోని హనోయ్‌ కు తన విమానం బయలుదేరిందని చూపించే తన టికెట్ స్క్రీన్‌ షాట్‌ను కూడా ఆయన షేర్ చేశాడు. ఆయన స్నేహితులు అదే రోజు హనోయ్ నుంచి ఫు క్వాక్‌ కు విమానం ఎక్కారు. ఫ్లిప్‌ కార్ట్, క్లియర్‌ ట్రిప్, ఎయిర్‌లైన్ అన్నీ ఒకరినొకరు నిందించుకుంటున్నాయని చెప్పుకొచ్చాడు. “ఫ్లిప్‌ కార్ట్/క్లియర్‌ ట్రిప్‌ తో కనెక్ట్ అవ్వండి. వారు టికెట్‌ ను సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. కాబట్టి రద్దు చేయబడింది” అని ఎయిర్‌ లైన్‌ అధికారులు చెప్పారు” అని వివరించాడు.

స్పందించిన ఫ్లిప్‌ కార్ట్

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టుపై ఫ్లిప్‌ కార్ట్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. అతడి సమస్య పరిష్కరించబడుతుందని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించడానికి వీలుగా అతడి వివరాలను పంచుకోవాలని కంపెనీ కోరింది. అయినప్పటికీ, అతడు తర్వాత హ్యూమన్ సపోర్టుకు బదులుగా ఆటోమేటెడ్ చాట్‌ బాట్‌ తో సంభాషిస్తున్నట్లు చూపించే స్క్రీన్‌ షాట్లను షేర్ చేశాడు. “చాట్‌ బాట్‌ను ఏర్పాటు చేయడం సపోర్ట్ కాదు.  నాకు త్వరగా పరిష్కారం కావాలి” అని డిమాండ్ చేశాడు. ఆయనకు ఫ్లిప్‌ కార్ట్ మళ్లీ రిప్లై ఇచ్చింది. “మా బృందం మీకు సపోర్ట్ ఇవ్వడానికి అంకితభావంతో పని చేస్తుంది. మీకు అవసరమైన సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీ ఫ్లిప్‌ కార్ట్ అకౌంట్ ప్రైవసీ కోసం ప్రైవేట్ చాట్‌ను ప్రారంభించండి” అని సూచించింది. మరోవైపు ఈ ఘటనపై చీటింగ్ కేసు పెట్టాలని నెటిజన్లు సూచించారు. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Read Also: హైదరాబాద్ నుంచి ఏపీలోని ఈ నగరాలకు బుల్లెట్ ట్రైన్.. ఎప్పుడు మొదలుకానుందంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×