E-Paper
Advertisement

Malayalam OTT releases 2026 : 2026 జనవరిలో ఓటీటీలోకి రాబోతున్న మలయాళం సినిమాలు… ఏ ఓటీటీలో ఏ మూవీ అంటే ?

Malayalam OTT releases 2026 : 2026 జనవరిలో ఓటీటీలోకి రాబోతున్న మలయాళం సినిమాలు… ఏ ఓటీటీలో ఏ మూవీ అంటే ?
Advertisement

Malayalam OTT releases 2026 : మలయాళ సినిమా 2025లో సూపర్ హిట్స్ ఇచ్చి, 2026 న్యూ ఇయర్‌ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో గ్రాండ్‌గా స్టార్ట్ చేస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా Netflix, SonyLiv, Prime Video వంటి OTTలలో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు రాబోతున్నాయి. అయితే 2026 జనవరిలో స్ట్రీమింగ్ కాబోతున్న మలయాళ సినిమాలు ఏంటో ఒక లుక్కేద్దాం పదండి.

Eko

‘కిష్కింధ కాండం’ డైరెక్టర్ దిన్‌జిత్ అయ్యత్తన్ నుంచి వచ్చిన మరో మూడీ మిస్టరీ థ్రిల్లర్ ‘ ఎకో’. సందీప్ ప్రదీప్ హీరోగా నటించాడు. కుక్కల బ్రీడర్, హీరో భార్య, యూత్ కేర్‌గివర్ చుట్టూ తిరిగే గ్రిప్పింగ్ స్టోరీ ఇది. సౌరభ్ సచ్దేవ, వినీత్, నారాయణ్, బిను పప్పు తదితరులు ఇందులో నటించారు. థియేటర్స్‌లో హిట్ అయిన ఈ మూవీ జనవరి 2026లో Netflixలో స్ట్రీమింగ్ అవుతుందని రూమర్స్ విన్పిస్తున్నాయి. మూవీ ఓటీటీ ఎంట్రీపై అఫిషియల్ అనౌన్స్మెంట్ గురించి వెయిటింగ్.

Kalamkaval

Advertisement

మమ్ముట్టి డార్క్ అవతార్‌ లో సీరియల్ కిల్లర్ స్టాన్లీ డాస్ పాత్రను పోషించిన మూవీ ‘కళంకావల్’. వినాయకన్ కాప్ రోల్‌లో నటించారు. జితిన్ K జోస్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్‌ దగ్గర మంచి టాక్ తో బాగా రన్ అవుతోంది. థియేట్రికల్ రన్ అయిపోయాక జనవరి 2026లో SonyLiv లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ.

Balti

షేన్ నిగమ్ లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘బాల్టి’. నలుగురు కబడ్డీ ప్లేయర్స్ గ్రామంలో పవర్‌ ఫుల్ క్రిమినల్స్‌తో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది కథ. ప్రీతి అస్రాని హీరోయిన్, సెల్వరాఘవన్, అల్ఫాన్స్ పుత్రేన్ నటించిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ను Prime Video కన్ఫర్మ్ చేసింది. జనవరి 2026లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని చూడవచ్చు.

Vilaayath Buddha

Advertisement

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో-డైరెక్టర్‌గా లీడ్ చేసిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘విలాయత్ బుద్ధ’. డబుల్ మోహనన్ పాత్రలో నటించారు పృథ్వీరాజ్. చందనం చెట్టు గురించి మోహనన్… భాస్కరన్ మాస్టర్‌తో (షమ్మీ తిలకన్) కు మధ్య చోటు చేసుకునే గొడవ ఈ మూవీ స్టోరీ లైన్. G.R. ఇందుగోపన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ 2026 జనవరిలో ఓటేటీకి రాబోతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇంకా కన్ఫామ్ కాలేదు.

Dheeram

ఇంద్రజిత్ సుకుమారన్ ఖాకీ యూనిఫాం ధరించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ధీరమ్’. కోజికోడ్ జిల్లాలో జరిగే సీరియల్ మర్డర్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. జితిన్ సురేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్ విజయ రాఘవన్, దివ్య పిళ్లై కీ రోల్స్ పోషించారు. డిసెంబర్ 5న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా 2026 జనవరిలో ఓటీటీలోకి రాబోతోంది.

 

Read Also : ఓటీటీలో ఎమోషనల్ సునామీ సృష్టించిన 1 గంట 49 నిమిషాల సై-ఫై డ్రామా… గుండెను మెలిపెట్టే కథ గురూ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×