E-Paper
Advertisement

పెట్రోల్ vs ఎలక్ట్రిక్ కారు.. కిలో మీటర్‌కు రూ.1 అనేది.. నిజమా లేక మార్కెటింగ్ జిమ్మిక్కా?

పెట్రోల్ vs ఎలక్ట్రిక్ కారు.. కిలో మీటర్‌కు రూ.1 అనేది.. నిజమా లేక మార్కెటింగ్ జిమ్మిక్కా?
Advertisement

Electric Cars: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. ఎలక్ట్రిక్ కార్లు (EVs) మధ్యతరగతి ప్రజలకి ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కిలోమీటరుకు రూపాయి కంటే తక్కువ ఖర్చు అని ఈవీ కంపెనీల ప్రకటనలు.. అందరినీ ఆకర్షిస్తున్నాయి. అయితే ఇది నిజంగా సాధ్యమేనా? లేక కేవలం కంపెనీల మార్కెటింగ్ జిమ్మిక్కా? అని చాలా మంది సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని వెనుక ఉన్న నిజానిజాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూ.1 కంటే తక్కువే పడుతుందా?

ఎలక్ట్రిక్ కార్లు.. కిలోమీటర్ కు రూ.1 మాత్రమే ఖర్చు చేస్తాయని జరుగుతున్న ప్రచారంలో ఎంతో కొంత వాస్తవం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ సైతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఈవీ కారును ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటే.. యూనిట్ కు రూ.7 – 9 వరకూ ఖర్చు అవుతుంది. సగటున ఒక యూనిట్ ఛార్జ్ తో ఈవీ కార్లు సుమారు 7 నుండి 8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అంటే ఒక కిలోమీటరుకు అయ్యే ఖర్చు దాదాపు రూ.0.80 నుండి రూ.1.30 మధ్యలో ఉంటుంది. అదే పెట్రోల్ కారు అయితే లీటరు రూ.110 దాటిన నేపథ్యంలో కిలోమీటరుకు కనీసం రూ.7-8 ఖర్చు అవుతుందని అంచనా.

ఇంట్లో ఛార్జింగ్ చేస్తేనే బెనిఫిట్..

Advertisement

అయితే కిలోమీటర్ కు రూ.1 ఖర్చు అనే కాన్సెప్ట్.. ఈవీని కేవలం ఇంటి దగ్గర మాత్రమే ఛార్జ్ చేసినప్పుటు వర్కౌట్ అవుతుంది. డొమెస్టిక్ అవసరాల కోసం ఇచ్చే విద్యుత్ కు రూ.7-9 (యూనిట్ కు) ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఒకవేళ బయట హైవేలపై ఉండే పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లను వాడితే.. అక్కడ యూనిట్ ధర రూ.20 నుండి రూ.25 వరకు ఉంటుంది. అప్పుడు కిలోమీటరుకు ఖర్చు రూ.3 నుండి రూ.4 వరకు పెరుగుతుంది. అయినప్పటికీ పెట్రోల్ కు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది సగమే కావడం విశేషం.

సర్వీసింగ్ ఖర్చు కూడా తక్కువే..!

సాధారణంగా పెట్రోల్ కార్లలో ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఫిల్టర్లు మార్చడం వంటి పనులు తరచుగా చేస్తూ ఉండాలి. కానీ ఎలక్ట్రిక్ కార్లలో ఇంజిన్ ఉండదు కాబట్టి అలాంటి ఖర్చులేమి ఉండవు.  ఈవీ కారు మోటార్, బ్యాటరీ సరిగ్గా ఉంటే సరిపోతుంది. అందుకే ఈవీల సర్వీసింగ్ ఖర్చు చాలా తక్కువని నిపుణులు అంటుంటారు. ఏడాదికి ఒక పెట్రోల్ కారు సర్వీసింగ్‌కు సగటున రూ.10,000 ఖర్చయితే.. ఈవీకి కేవలం రూ.2,000 నుండి రూ.3,000 మాత్రమే అవుతుందని తెలియజేస్తుంటారు. దీన్నిబట్టి సర్వీసింగ్ ఖర్చుల పరంగా చూసినా కూడా వినియోగదారులకు కిలోమీటరుపై పడే భారం తగ్గుతుందని చెప్పొచ్చు.

Advertisement

Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. రాబోయే 6 నెలలు.. కొత్త కార్లు, బైక్‌ కొనుగోళ్లపై నిషేధం!

ధర విషయానికి వస్తే..

పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు.. రూ.3-5 లక్షల వరకూ ఎక్కువగా ఉంటాయని ఆటోమెుబైల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే అదనంగా పెట్టిన ఈ డబ్బును దీర్ఘ కాలంలో తిరిగి పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈవీ కారులో నెలకు కనీసం 1,000 నుండి 1,500 కిలోమీటర్లు ప్రయాణిస్తారని భావిస్తే.. పెట్రోల్ పై ఆదా అయ్యే డబ్బు ద్వారా 3-4 ఏళ్లలో ఆ మెుత్తాన్ని తిరిగి దక్కించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Also Read: కొత్త ఏసీ లేదా కూలర్ మెురాయిస్తోందా? రూపాయి ఖర్చు లేకుండా.. మరో ఏసీ, రూ.1 లక్ష పొందే ఛాన్స్!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×