Hayathnagar: హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో గుండెల్ని పిండేసే విషాద ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాననే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి, ఇంట్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. అయితే, యువతి ఇటీవల ఆ బిడ్డను ఎవరికో అమ్మేసి, ప్రియుడిని కాదని మరొకరితో వివాహానికి సిద్ధమైంది. అంతటితో ఆగకుండా, తన పెళ్లి పనులను కూడా ప్రియుడితోనే చేయించుకుని అతని మనసును తీవ్రంగా గాయపరిచింది.
తన బిడ్డను అమ్మేసి, వేరే పెళ్లికి సిద్ధమైన యువతను తనతో వచ్చేయాలని ప్రియుడు ఎన్నోసార్లు బతిమాలినా ఆమె నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను, మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకుని బుధవారం ఉదయం ఇంటికి వచ్చాడు. సాయంత్రమైనా గదిలోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరి తలుపులు పగలగొట్టి చూడగా, ఆ వ్యక్తి ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. చనిపోయే ముందు అతను ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. తన మరణానికి కారణమైన యువతిని, ఆమెకు సహకరించిన వారిని అస్సలు వదిలిపెట్టవద్దని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన నెయ్యి నిల్వ సామర్థ్యం!
ప్రేమించిన యువతి మోసం.. బిడ్డను అమ్మేసిందన్న ఆవేదనతో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని కొహెడలో విషాదం చోటుచేసుకుంది. సరిత అనే యువతి తనను ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకుని, ఇప్పుడు బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైందనే మనస్తాపంతో పల్లపు గోవర్ధన్ అనే యువకుడు… pic.twitter.com/YVxOrFWtK5
— ChotaNews App (@ChotaNewsApp) May 15, 2026