E-Paper
Advertisement

రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. రాబోయే 6 నెలలు.. కొత్త కార్లు, బైక్‌ కొనుగోళ్లపై నిషేధం!

రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. రాబోయే 6 నెలలు.. కొత్త కార్లు, బైక్‌ కొనుగోళ్లపై నిషేధం!
Advertisement

Vehicle Ban: దిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే 6 నెలల పాటు కొత్త కార్ల కొనుగోళ్లపై నిషేధం విధించింది. అలాగే పెట్రోల్ తో నడిచే బైక్ లపైనా ఈ ఆంక్షలు కొనసాగుతాయని దిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. అయితే ఇది కేవలం ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ నిషేధంతో సామాన్యులకు సంబంధం లేదని అన్నారు.

ప్రభుత్వానికి సంబంధించిన రోజూవారి అవసరాల కోసం ప్రతీ రాష్ట్రం ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది. అలాగే బైక్స్ ను సైతం కొని.. సంబంధిత అధికారులకు ఇస్తూ ఉంటుంది. కాగా దిల్లీ ప్రభుత్వం ఈ విధానంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దీని ప్రకారం వచ్చే 6 నెలల పాటు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్ జీతో నడిచే వాహనాలను దిల్లీ ప్రభుత్వం కొనుగోలు చేయదు.

Advertisement

అయితే వాహనాలకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధలను అమలు చేస్తోంది. 10 ఏళ్ల క్రితం నాటి డీజిల్ కార్లు, 15 ఏళ్ల కాలం నాటి పెట్రోల్ కార్లు రోడ్లపైకి రాకుండా నిషేధం విధించింది. అతి తక్కువ సమయంలో వాహనాలకు సంబంధించి ఇన్ని కఠినమైన ఆంక్షలను దిల్లీ ప్రభుత్వం తీసుకొస్తుండటం.. దిల్లీ పౌరులతో పాటు కార్ల తయారీ సంస్థలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అయితే గురువారమే దిల్లీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలను ఆదేశించింది. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. ప్రయాణానికి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని దిల్లీ సీఎెం రేఖా గుప్తా పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ను కంపెనీలు ప్రోత్సహించాలని సూచించారు. చమురును పొదుపుగా ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: కొత్త ఏసీ లేదా కూలర్ మెురాయిస్తోందా? రూపాయి ఖర్చు లేకుండా.. మరో ఏసీ, రూ.1 లక్ష పొందే ఛాన్స్!

అయితే దిల్లీ ప్రభుత్వం 6 నెలలపాటు కార్లు, బైక్స్ పై నిషేధం విధించడానికి చమురు కొరతతో పాటు మరో ప్రధానమైన కారణం కూడా ఉంది. దిల్లీలో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి వాహనాల ఉద్గారాలే ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. గణాంకాల ప్రకారం.. దిల్లీలోని మొత్తం వాహనాల్లో 80-90 శాతం పెట్రోల్, డీజిల్ వాహనాలే ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే మార్పు తన నుంచే మెుదలవ్వాలన్న ఉద్దేశంతో పాటు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కార్లు, బైక్స్ కొనుగోళ్లపై దిల్లీ సర్కార్ నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

Also Read: BSNL కొత్త ప్లాన్ చూశారా? రూ.225 చెల్లిస్తే చాలు.. నెలంతా ఇక జాతరే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×