ప్రస్తుతం చాలా మంది పర్యావరణ హితమైన ప్రయాణం పట్ల మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పట్ల మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. నిజానికి ఈవీ బైకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు. రన్నింగ్ ఖర్చు తక్కువ. నగరాల్లో డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, సరైన ఎంపిక చేయడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎలక్ట్రిక్ బైక్ కు హార్ట్ బ్యాటరీ. బైక్ రేంజ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. సిటీ కమ్యూటింగ్ కోసం 2-3 kWh బ్యాటరీ సరిపోతుంది. లాంగ్ రేంజ్ కావాలంటే 4 kWh, అంతకంటే ఎక్కువ కెపాసిటీది తీసుకోవాలి. తయారీ కంపెనీలు రేంజ్ 100-200 కి.మీ. అని చెప్పినా, రియల్ వరల్డ్ రేంజ్ 70-150 కి.మీ మాత్రమే ఉంటుంది. రోజువారీ 50 కి.మీ. కమ్యూట్ కోసం మంచి రేంజ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. రిమూవబుల్ బ్యాటరీ ఉంటే ఇంట్లో చార్జ్ చేయడం సులభం. బ్యాటరీ లైఫ్ 2-5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత రీప్లేస్ చేయాలి.
మోటార్ పవర్ 250W-1500W మధ్య ఉండాలి. సిటీ యూజ్ కోసం 500-800W సరిపోతుంది. హై స్పీడ్ మోడల్స్ కోసం 1000W+ సెలెక్ట్ చేసుకోవాలి. హబ్ మోటార్, మిడ్ డ్రైవ్ మోటార్ ఉంటే మంచిది. రిలయబిలిటీ ముఖ్యం. చైనా పార్ట్స్ ఉన్నవి చెక్ చేయండి. హిల్స్, హైవేలపై డ్రైవ్ చేస్తే టార్క్ 120+ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి.
చార్జింగ్ టైం 3-6 గంటలు, ఫాస్ట్ చార్జర్ తో 1-2 గంటలు ఉండాలి. హోమ్ చార్జింగ్ సదుపాయం ఉండాలి. దేశంలో చార్జింగ్ స్టేషన్లు పెరుగుతున్నాయి. కానీ, సిటీల్లో మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. బ్యాటరీ స్వాప్ సిస్టమ్ ఉన్న మోడల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీ మార్చుకోవచ్చు.
బిల్డ్ బరువు 80-120 కేజీల మధ్య ఉండాలి. సస్పెన్షన్, బ్రేకులు ఉండేలా చూసుకోవాలి. డిజిటల్ డిస్‌ప్లే, రిజనరేటివ్ బ్రేకింగ్, GPS, స్మార్ట్ కనెక్టివిటీ. ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ తక్కువ. కానీ, సర్వీస్ సెంటర్ దగ్గర ఉండాలి.
ధర రూ.50,000- రూ. 2 లక్షల మధ్య ఉండాలి. ఎంట్రీ లెవల్ రూ. 80,000 నుంచి ఉండేలా చూసుకోవాలి. సబ్సిడీలు FAME-II స్కీమ్ కింద రూ.10,000- రూ.40,000 లభిస్తాయి. రన్నింగ్ ఖర్చు పెట్రోల్ బైక్‌తో పోలిస్తే 80-90 శాతం సేవ్ అవుతుంది.
బ్యాటరీకి 3-5 సంవత్సరాలు, మోటార్‌కు 1-2 సంవత్సరాలు ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ టెండెడ్ వారంటీ ఆప్షన్ చెక్ చేయాలి. సర్వీస్ సెంటర్ 30 కి.మీ.లోపు ఉండాలి.
250W కంటే తక్కువ పవర్ అయితే లైసెన్స్ అవసరం లేదు. అంతకంటే ఎక్కువ అయితే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కావాలి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇన్సూరెన్స్ తప్పనిసరి. థర్డ్ పార్టీ కవరేజ్ తీసుకోండి.
ప్రస్తుతం దేశంలో ఓలా ఎలక్ట్రిక్, అథర్, బజాజ్ చేతక్, హీరో విడా, టీవీఎస్ ఐక్యూబ్, హోండా WN7, అల్ట్రావయోలెట్ F77 పాపులర్ మోడల్స్ గా కొనసాగుతున్నాయి.
Read Also: హీరో ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్!