E-Paper
Advertisement

Hero Electric Optima: హీరో ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్!

Hero Electric Optima: హీరో ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్..  తక్కువ ధర, ఎక్కువ రేంజ్!
Advertisement

Hero Electric Optima 2026: హీరో నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ ఆప్టిమా ఇండియాలో అఫర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. డైలీ కమ్యూటింగ్‌ కు బాగా ఉపయోగపడుతుంది. ఇది CX సిరీస్‌లో రెండు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటిలో ఒకటి CX 2.0 కాగా, మరొకటి CX 5.0. ఇందులో డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది. 2026లో ఎలాంటి మేజర్ అప్‌డేట్స్ లేకపోయినా, FAME-II సబ్సిడీలు మారే అవకాశం కనిపిస్తోంది.

హీరో ఆప్టిమా ధరలు  

⦿ ఆప్టిమా CX 2.0: రూ.83,300

Advertisement

⦿ Optima CX 5.0:  రూ.1,04,360

ధరలు రాష్ట్రాలు, సిటీల ప్రకారం రూ.80,000 నుంచి రూ.1.30 లక్షల వరకు ఉంటుంది. ఆన్ రోడ్ RTO, ఇన్సూరెన్స్ కారణంగా కాస్త ఎక్కువగా ఉంటుంది.

హీరో ఆప్టిమా బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్

Advertisement

ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్ లో లిథియం ఐయాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. CX 2.0 లో 2 kWh బ్యాటరీ,  CX 5.0లో  3 kWh  డ్యూయల్ బ్యాటరీ సెటప్ ఉంటుంది. చార్జింగ్ టైమ్ విషయానికి వస్తే CX 2.0లో 4.5 గంటలు, CX 5.0లో 6.5 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ వారంటీ 4 సంవత్సరాలు ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ అవకాశం లేదు.  స్టాండర్డ్ హోమ్ చార్జర్ ఉపయోగించవచ్చు.

హీరో ఆప్టిమా రైడ్ రేంజ్, స్పీడ్

హీరో ఆప్టిమాకు సంబంధంచి CX 2.0 ఫుల్ ఛార్జ్ తో 89 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. CX 5.0 ఫుల్ ఛార్జ్ తో 135 కిలో మీటర్ల పరిధి అందిస్తుంది.  రియల్ వరల్డ్ రేంజ్ చూస్తే, డ్రైవింగ్ స్టైల్, లోడ్, రోడ్ కండిషన్స్ ను బట్టి 70-120 కిలో మీటర్ల రేంజ్ లభిస్తుంది. టాప్ స్పీడ్ 45-55 కిలో మీటర్లు ఉంటుంది.  ఈ స్కూటర్ లో మోటార్ పవర్ 1.2 kW నుంచి 1.9 Kw వరకు టుంది. BLDC హబ్ మోటార్ ఉంటుంది.

Read Also: ఏకంగా 10కి పైగా మోడల్స్.. 2026లో మహీంద్రా లాంచ్ లైనప్ మాములూగా లేదుగా!

హీరో ఆప్టిమా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే డిజిటల్ డిస్‌ ప్లే ఉంటుంది. LED హెడ్‌ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్స్ ఉంటాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, రిమోట్ లాక్ విత్ యాంటీ థెఫ్ట్ అలారం, రిజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. USB చార్జింగ్ పోర్ట్, క్రూజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్ ఫంక్షన్, రివర్స్ మోడ్, అండర్‌ సీట్ స్టోరేజ్ ఉంటుంది.  సైన్ బ్లూ, మ్యాట్ రెడ్, వైట్ లాంటి కలర్ ఆప్షన్స్ లో ఉంటుంది.  లైట్‌ వెయిట్ డిజైన్, రిమూవబుల్ బ్యాటరీ, లో రన్నింగ్ కాస్ట్ ఉంటుంది. ఈ స్కూటర్ డైలీ యూజ్‌కు మంచి ఆప్షన్. కానీ, ప్లాస్టిక్ బాడీ స్ట్రెంగ్త్, బ్రేక్స్ మీద కొన్ని నెగెటివ్ రివ్యూలు ఉన్నాయి. కొనేటప్పుడు కాస్త పరిశీలించండి.

Read Also: అన్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు ఇవే.. కొనేటప్పుడు కాస్త జాగ్రత్త!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×