E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ బైక్ vs పెట్రోల్ బైక్.. డైలీ యూజ్‌ కు ఏ బైక్ ఏది బెస్ట్?

ఎలక్ట్రిక్ బైక్ vs  పెట్రోల్ బైక్.. డైలీ యూజ్‌ కు ఏ బైక్ ఏది బెస్ట్?
Advertisement

Electric Bike vs Petrol Bike: మన దేశంలో చాలా కాలంగా పెట్రోల్ బైక్‌ లకే ఎక్కువ డిమాండ్ ఉంది. మంచి మైలేజ్, ఎక్కడైనా పెట్రోల్ బంకులు అందుబాటులో ఉండటం, సర్వీస్ సెంటర్లు సులభంగా దొరకడం వల్ల ఎక్కువ మంది ఇప్పటికీ పెట్రోల్ బైక్‌ లనే వాడుతున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటం, ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ పెరగడం వల్ల EV బైక్‌లు కూడా మార్కెట్లో వేగంగా ఆదరణ పొందుతున్నాయి.

ఈవీల వైపు తక్కువ దూరం వెళ్లే వారి చూపు

ప్రస్తుతం నగరాల్లో రోజూ ఆఫీస్‌కు వెళ్లే వాళ్లు, చిన్న దూరాలు ప్రయాణించే వాళ్లు ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా EV బైక్‌లు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు సులభంగా వెళ్లగలుగుతున్నాయి. సాధారణంగా నగరాల్లో రోజుకు 20 నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణమే ఎక్కువగా ఉంటుంది. ఈ దూరానికి EV బైక్‌లు చాలిపోతున్నాయి.

Advertisement

ట్రాఫిక్‌లో కూడా ఎలక్ట్రిక్ బైక్‌లు నడపడం చాలా సులభంగా అనిపిస్తుంది. క్లచ్, గేర్ మార్చాల్సిన అవసరం లేకపోవడంతో రైడర్‌కు ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి భారీ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది. అలాగే EV బైక్‌లు వెంటనే టార్క్ ఇస్తాయి. స్టార్ట్ కాగానే వేగంగా ముందుకెళ్తాయి. .

ఖర్చు పరంగా చూసినా ఎలక్ట్రిక్ బైక్‌లు లాభదాయకంగానే కనిపిస్తున్నాయి. పెట్రోల్‌తో పోలిస్తే ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువ. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఇంజన్ ఆయిల్ మార్చడం, క్లచ్ సమస్యలు, ఎక్కువ మెకానికల్ పార్ట్స్ వంటి విషయాలు EVల్లో ఉండవు. అందుకే రోజూ ఎక్కువగా బైక్ వాడేవాళ్లకు దీర్ఘకాలంలో డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

ఇప్పటికీ పెట్రోల్ బైక్ లకు తగ్గని ఆదరణ

Advertisement

అటు పెట్రోల్ బైక్‌లకు ఇప్పటికీ ఆదరణ దగ్గలేదు. ఇందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దేశంలో దాదాపు ప్రతి ప్రాంతంలో పెట్రోల్ బంకులు ఉన్నాయి. కానీ, ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో EV ఛార్జింగ్ సమస్యగా మారొచ్చు. అలాగే ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లకు పెట్రోల్ బైక్‌లు ఇంకా అనుకూలంగా ఉంటాయి. పెట్రోల్ నింపడానికి కొన్ని నిమిషాలే పడతాయి. కానీ EV ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం అవసరం అవుతుంది.

ఇంకో విషయం ఏమిటంటే, భారతీయులు బైక్‌ను కేవలం వాహనంగా మాత్రమే కాకుండా ఒక అటాచ్ మెంట్ తో చూస్తారు. ఇంజన్ సౌండ్, గేర్ ఛేంజెస్, రైడింగ్ ఫీలింగ్ లాంటి విషయాలు చాలా మందికి ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. ఆ ఫీలింగ్‌ ను పెట్రోల్ బైక్‌లు ఇంకా బలంగా అందిస్తున్నాయి. EV బైక్‌లు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నా, ఆ అనుభూతిని పూర్తిగా ఇవ్వలేకపోతున్నాయని కొంతమంది భావిస్తున్నారు. మొత్తానికి, రోజూ నగర ప్రయాణాలకు, తక్కువ ఖర్చుతో వాడాలనుకునేవారికి ఎలక్ట్రిక్ బైక్‌ లు మంచి ఆప్షన్ కాగా, సుదూర ప్రయాణాలు, గ్రామాల్లో వినియోగానికి పెట్రోల్ బైక్‌లే ఇంకా బెటర్ ఆప్షన్‌ గా ఉన్నాయి.

Read Also: చేతులు వదిలి బైక్ నడిపితే ఆటోమేటిక్‌ గా స్పీడ్ తగ్గింపు.. యాక్సిడెంట్స్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం క్రేజీ ప్లాన్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×