E-Paper
Advertisement

చేతులు వదిలి బైక్ నడిపితే ఆటోమేటిక్‌ గా స్పీడ్ తగ్గింపు.. యాక్సిడెంట్స్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం క్రేజీ ప్లాన్!

చేతులు వదిలి బైక్ నడిపితే ఆటోమేటిక్‌ గా స్పీడ్ తగ్గింపు.. యాక్సిడెంట్స్ కు చెక్ పెట్టేందుకు  కేంద్రం క్రేజీ ప్లాన్!
Advertisement

Smart Safety Features in Bikes: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతోంది. ముఖ్యంగా బైక్‌లు, స్కూటర్లు నడుపుతున్నప్పుడు చేతులు వదిలేసి స్టంట్లు చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం లాంటి ప్రమాదకర అలవాట్లను అరికట్టడమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టూవీలర్స్ లో ప్రత్యేక స్మార్ట్ సేఫ్టీ సిస్టమ్‌ ను అమలు చేసే దిశగా చర్చలు జరుపుతోంది.

హ్యాండిల్ పై చేతుల లేకపోతే నో స్టార్ట్!

కేంద్రం తాజా ప్రతిపాదనల ప్రకారం రానున్న రోజుల్లో బైక్, స్కూటర్ స్టార్ట్ కావాలంటే రైడర్ రెండు చేతులు హ్యాండిల్‌ పై ఉన్నాయా? లేదా? అనే విషయాన్నివెహికల్ ముందుగానే గుర్తిస్తుంది. రెండు చేతులు సరిగా హ్యాండిల్‌ బార్‌ పై లేకపోతే బండి స్టార్ట్ కాకుండా చేసే ఇగ్నిషన్ లాక్ సిస్టమ్‌ ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని కోసం హ్యాండిల్‌ లో ప్రత్యేక సెన్సార్లు,  ప్రెజర్ డిటెక్షన్ టెక్నాలజీ ఉపయోగించే అవకాశం ఉంది.

చేతులు వదిలేసి నడిపితే వార్నింగ్ సిగ్నల్స్

Advertisement

అంతేకాదు, వెహికల్ రన్నింగ్ లో ఉన్న టైమ్ లో చేతులు వదిలేస్తే వెంటనే వార్నింగ్స్ వచ్చే సిస్టమ్ రూపొందిస్తున్నారు.  రైడర్‌ కు ఆడియో అలర్ట్, డాష్‌ బోర్డ్ వార్నింగ్, మెరుస్తున్న లైట్లు ద్వారా అప్రమత్తం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ముఖ్యంగా యూత్ సోషల్ మీడియాలో వీడియోల కోసం చేసే స్టంట్లు, హ్యాండ్స్ ఫ్రీ రైడింగ్, ఫోన్ చూస్తూ బైక్ నడపడం లాంటి చర్యలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది.

హ్యాండిల్ మీద చేతులు తీస్తే స్పీడ్ తగ్గింపు

కేంద్రం తీసుకురానున్న కొత్త టెక్నాలజీలో మరో అంశం ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్. రైడర్ ఎక్కువ సేపు చేతులు లేకుండా వాహనం నడుపుతున్నట్లు సిస్టమ్ గుర్తిస్తే, బైక్ వేగాన్ని క్రమంగా తగ్గించే ఫీచర్‌ ను కూడా పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా బ్రేక్ వేయకుండా నెమ్మదిగా స్పీడ్ తగ్గేలా టెక్నాలజీ రూపొందించే అవకాశం ఉంది. దీని వల్ల రైడర్ మళ్లీ వెహికల్ పై కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది.

బైక్ ప్రమాదాల సంఖ్య పెరగడంతో..

Advertisement

దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. అతివేగం, స్టంట్ రైడింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రమాదకర రైడింగ్ వీడియోలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీ అమలైతే బైక్‌ ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, తయారీదారులు కొత్త సెన్సార్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్స్, వార్నింగ్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లను యాడ్ చేయాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఆటోమొబైల్ కంపెనీలు, రోడ్ సేఫ్టీ నిపుణులు, రవాణా శాఖ అధికారులతో చర్చలు జరపనుంది. అంతా ఒకే అనుకుంటే, రానున్న రోజుల్లో భారత్‌ లో విక్రయించే కొత్త బైక్‌ లు, స్కూటర్లలో ఈ భద్రతా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: తక్కవ ధరలో క్రూజ్ కంట్రోల్ బైక్ కావాలా? ఈ 5 మోడళ్లు బెస్ట్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×