E-Paper
Advertisement

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?
Advertisement

Electric Scooter Sales Fall in August 2026: భారత్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ జోరుగా దూసుకెళ్తోంది. అయితే, ఆగస్టులో అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. జూలైలో తొలిసారిగా నెలలో 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడై రికార్డు సృష్టించగా, ఆగస్టులో మొత్తం 1,82,936 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. జూలైతో పోలిస్తే ఇది సుమారు 11 శాతం తక్కువ. అయితే, గత ఏడాది ఆగస్టుతో పోల్చితే పరిస్థితి భిన్నంగా ఉంది. 2025 ఆగస్టుతో పోలిస్తే ఈసారి అమ్మకాలు ఏకంగా 67 శాతం పెరిగాయి. అంటే, నెలవారీగా కొంత తగ్గుదల కనిపించినా, ఎలక్ట్రిక్ టూవీలర్స్ కు డిమాండ్ మాత్రం బలంగానే కొనసాగుతోంది.

2026లో ఇప్పటికే కొత్త రికార్డు!

జనవరి నుంచి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా 13.6 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. 2025లో ఏడాది మొత్తానికి నమోదైన 13.4 లక్షల అమ్మకాలను కేవలం ఎనిమిది నెలల్లోనే అధిగమించాయి. మరో నాలుగు నెలలు మిగిలి ఉండటంతో పాటు పండుగ సీజన్ కూడా ముందుండటంతో ఈ ఏడాది మొత్తం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీ 20 లక్షల వార్షిక విక్రయాల మైలురాయిపై దృష్టి పెట్టింది.

TVS, బజాజ్ ఆధిపత్యం

Advertisement

ఆగస్టు అమ్మకాల్లో TVS మోటార్ కంపెనీ ముందంజలో నిలిచింది. కంపెనీ 48,873 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి 27 శాతం మార్కెట్ వాటాను సాధించింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే TVS అమ్మకాలు 91 శాతం పెరిగాయి. జూలైలో నమోదైన 55,823 యూనిట్లతో పోలిస్తే మాత్రం ఆగస్టులో అమ్మకాలు తగ్గాయి.

బజాజ్ ఆటో 41,019 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 235 శాతం వృద్ధి నమోదైంది. అయితే గత ఏడాది సరఫరా సమస్యల కారణంగా బజాజ్ అమ్మకాలు తక్కువగా ఉండటంతో ఈ జోష్ ను ఆ కోణంలో చూడాల్సి ఉంటుంది.

ఏథర్, విడా జోరు

Advertisement

ఏథర్ ఎనర్జీ ఆగస్టులో 28,708 యూనిట్లను అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధితో 16 శాతం మార్కెట్ వాటాను సాధించింది. కొత్త కోనార్క్ మోడల్‌ తో రాబోయే పండుగ సీజన్‌లో మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ చూస్తోంది.

హీరో విడాకు చెందిన ఎలక్ట్రిక్ విభాగం 18,978 యూనిట్లను విక్రయించింది. జూలై రికార్డుతో పోలిస్తే తగ్గినా, ఏడాది ప్రాతిపదికన 38 శాతం వృద్ధి సాధించింది. జనవరి-ఆగస్టు మధ్య విడా అమ్మకాలు 1.48 లక్షల యూనిట్లకు చేరాయి.

ఓలాకు ఎదురుదెబ్బ

టాప్ బ్రాండ్లలో ఓలా ఎలక్ట్రిక్‌కు మాత్రం ఆగస్టు గణాంకాలు నిరాశ కలిగించాయి. కంపెనీ 13,849 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 29 శాతం తగ్గాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు ఓలా అమ్మకాలు 94,307 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఉన్న 18 శాతం మార్కెట్ వాటా ఇప్పుడు 8 శాతానికి పడిపోయింది. టాప్-10 బ్రాండ్లలో అమ్మకాలు తగ్గిన ఏకైక సంస్థగా ఓలా నిలిచింది.

అటు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 8,612 యూనిట్లు విక్రయించి 89 శాతం వృద్ధిని నమోదు చేసింది. రివర్ మొబిలిటీ 5,134 యూనిట్లతో 170 శాతం, బిగాస్ ఆటో 4,844 యూనిట్లతో 180 శాతం వృద్ధిని సాధించాయి. సింపుల్ ఎనర్జీ 1,635 యూనిట్లను విక్రయించింది.

Read Also: కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

Tags

Related News

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×