E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ vs పెట్రోల్ స్కూటర్.. ఏది కొంటే సేవింగ్ ఎక్కువ?

ఎలక్ట్రిక్ vs పెట్రోల్ స్కూటర్.. ఏది కొంటే సేవింగ్ ఎక్కువ?
Advertisement

Electric Scooter vs Petrol Scooter: ఇండియన్ మార్కెట్ లో మంచి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు పెట్రోల్ స్కూటర్లు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మార్కెట్లో బోలెడు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, కొత్త వెహికల్ కొనాలనుకునే వారిలో చాలా మంది పెట్రోల్ స్కూటర్ కొనాలా?  ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా? అని ఆలోచిస్తారు. ధర, మెయింటెనెన్స్, మైలేజ్ లాంటి పూర్తి వివరాలను ఇప్పుడు కంపార్ చేద్దాం..

నిజానికి ఓ వ్యక్తి రోజుకు సగటున 30 కి.మీ ప్రయాణిస్తే, నెలకు 900 కి.మీ ప్రయాణం అవుతుంది. సుమారు విద్యుత్ యూనిట్ ధరను రూ.10గా, పెట్రోల్ ధరను రూ.100గా తీసుకుంటే.. దేనికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు స్కూటర్లలో దేని ఖర్చు ఎంత?

Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 5 యూనిట్లు విద్యుత్ అవసరం అవుతుందని అనుకుందాం. ఒక్కసారి ఛార్జింగ్‌కు రూ.50 ఖర్చవుతుంది. ఈ ఛార్జ్‌ తో సుమారు 100 కి.మీ ప్రయాణం చేయవచ్చు. అంటే ప్రతి కి.మీకి ఖర్చు రూ.0.50 అవుతుంది. నెలకు 900 కి.మీ ప్రయాణానికి రూ.450 ఖర్చవుతుంది. సంవత్సరానికి ఇది రూ.5,400 అవుతుంది. దీనికి సర్వీస్, మెయింటెనెన్స్ ఖర్చుగా సుమారు రూ.2,000 కలిపితే, మొత్తం సంవత్సరానికి రూ.7,400 ఖర్చవుతుంది.

ఇక పెట్రోల్ స్కూటర్ విషయానికి వస్తే.. లీటరుకు సుమారు 50 కి.మీ మైలేజ్ ఇస్తుందని అనుకుందాం. ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.100 అయితే, 50 కి.మీకి రూ.100 ఖర్చవుతుంది. అంటే ప్రతి కి.మీకి రూ.2 ఖర్చవుతుంది. నెలకు 900 కి.మీ ప్రయాణానికి రూ.1,800 ఖర్చవుతుంది. సంవత్సరానికి ఇది రూ.21,600 అవుతుంది. దీనికి మెయింటెనెన్స్ ఖర్చుగా రూ.2,000 కలిపితే, మొత్తం సంవత్సరానికి రూ.23,600 అవుతుంది.

5 సంవత్సరాల్లో ఖర్చు ఎంత అవుతుంది?

Advertisement

ఇప్పుడు 5 సంవత్సరాల ఖర్చును పరిశీలిస్తే.. పెట్రోల్ స్కూటర్ ధర సుమారు రూ.75,000 అనుకుంటే, 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఖర్చు రూ.1,93,000 వరకు చేరుతుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ.1,20,000 అయినా, 5 సంవత్సరాల పాటు నడిపితే మొత్తం ఖర్చు రూ.1,57,000 అవుతుంది. 5 సంవత్సరాల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా సుమారు రూ.36,000 వరకు ఆదా చేయవచ్చు. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సాధారణంగా 3 నుంచి 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఆ తర్వాత కొత్త బ్యాటరీ మార్చాల్సి వస్తే రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చు కావచ్చు.

Read Also: రూ. 1.5 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కోదాని రేంజ్ ఏంతో తెలుసా?

రోజువారీ ప్రయాణం ఎక్కువగా ఉండి ఖర్చు తగ్గించాలని భావించే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఎంపికగా ఉంటుంది. అయితే ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, వెంటనే రీఫ్యూయెలింగ్ అవసరమయ్యే వారు పెట్రోల్ స్కూటర్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు!

Read Also: యమహా సూపర్ హైబ్రిడ్ బైక్.. దీని డబుల్ పవర్ చూస్తే పిచ్చెక్కడం పక్కా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×