E-Paper
Advertisement

రూ. 1.5 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కోదాని రేంజ్ ఏంతో తెలుసా?

రూ. 1.5 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కోదాని రేంజ్ ఏంతో తెలుసా?
Advertisement

Best Electric Scooters Under 1.5 Lakh: ప్రస్తుతం మన దేశంలో ఈవీ స్కూటర్ల కొనుగోలుకు జనాలు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదల నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో రూ. 1.5 లక్షల లోపు టాప్ EV స్కూటర్లు బోలెడు ఉన్నాయి. వాటిలో మంచి రేంజ్ అందించే టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో ఓలా S1 ప్రో, ఏథర్ రిజ్టా,  విడా V1 ప్రో లాంటి మోడళ్లు రేంజ్, ఫీచర్లలో అదుర్స్ అనిపిస్తున్నాయి.

రూ. 1.5 లక్షల లోపు టాప్  EV స్కూటర్లు

⦿ ఓలా ఎస్1 ప్రో (జెన్ 2): ఈ స్కూరట్ ధర రూ. 1.2 లక్షల నుంచి రూ. 1.30 లక్షల వరకు ఉంటుంది. IDC రేంజ్ 176 కి.మీ నుంచి 1.30 కి.మీ వరకు ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. యాప్ కనెక్టివిటీ, ప్రీమియం ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

Advertisement

⦿ ఏథర్ రిజ్టా: ఈ స్కూటర్ ధర రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.45 లక్షల వరకు ఉంటుంది, IDC రేంజ్ 123 కి.మీ నుంచి 159 కి.మీ వరకు ఇస్తుంది. ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

⦿ హీరో విడా V1 ప్రో: ఈ స్కూటర్ ధర రూ, 1.49 లక్షల వరకు ఉంటుంది. దీని IDC పరిధి 165 కిలో మీటర్లు ఉంటుంది. రిమూవబుల్ బ్యాటరీ, ప్రీమియం క్వాలిటీ, 65 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ లాంటి ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ TVS iQube S: ఈ స్కూటర్ ధర రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.40 లక్షలు ఉంటుంది.  IDC రేంజ్ 100 కిలో మీటర్ల వరకు ఉంటుంది. నమ్మకమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈజీగా ఉపయోగించేలా ఉంటుంది. ఫ్యామిలీ ప్రయాణాలకు బాగుంటుంది.

⦿ బజాజ్ చేతక్: ఈ కంపెనీకి చెందిన 2903/అర్బేన్ వేరియంట్లు బాగుంటాయి. ధర రూ. 95 వేల నుంచి రూ. 1.07 లక్షల వరకు ఉంటుంది. IDC రేంజ్ 90-95 కిలో మీటర్లు. మంచి మెటల్ బాడీ, రెట్రో డిజైన్, 21 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

⦿ ఏథర్ 450ఎస్: ఈ స్కూటర్ ధర సుమారు రూ. 1.29 లక్షలు ఉంటుంది. 115 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. స్పోర్టీ లుక్, మంచి బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటుంది.

⦿ ఓలా ఎస్1 ఎక్స్ (4 kWh): ఈ స్కూటర్ ధర సుమారు రూ. 1.34 లక్షలు ఉంటుంది. దీని రేంజ్ 108 కి.మీ నుంచి 242 కి.మీ వరకు ఉంటుంది. పెద్ద బ్యాటరీతో మంచి రేంజ్ ను అందిస్తుంది.

⦿ ఆంపియర్ ప్రైమస్: ఈ స్కూటర్ ధర సుమారు రూ. 1.10 లక్షలు ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 100 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

Read Also: డైలీ ప్రయాణానికి బెస్ట్ చాయిస్, సుజుకి యాక్సెస్.. ధర ఎంతో తెలుసా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×