E-Paper
Advertisement

Enthusiast Oriented Bikes: 2026లో మార్కెట్లో అడుగు పెట్టబోతున్న.. లో కాస్ట్ యూత్ అట్రాక్షన్ బైక్స్!

Enthusiast Oriented Bikes:  2026లో మార్కెట్లో అడుగు పెట్టబోతున్న.. లో కాస్ట్ యూత్ అట్రాక్షన్ బైక్స్!

Enthusiast Oriented Bikes 2026:  2025 లో యువతను ఆకట్టుకునేలా పలు కూల్ బైక్స్ విడుదలయ్యాయి. మంచి స్టైల్ తో అలరించాయి. 2026లో అదే స్థాయిలో యాక్షన్‌ బైక్స్ రాబోతున్నాయి. తక్కువ ధరలో యూత్ ను ఫిదా చేయబోతున్నాయి. వీటి ధర రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉండబోతోంది.

⦿ హీరో ఎక్స్‌ పల్స్ 210 డాకర్

హీరో ఎక్స్‌ పల్స్ 210 అధికారికంగా లాంచ్ అయ్యింది. హీరో EICMA 2025లో డాకర్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త వేరియంట్ దేశీ మార్కెట్ లో 2026లో విడుదల కాబోతోంది. బహుశా జనవరి 2026 చివరి నాటికి అందుబాటులోకి రానుంది.  ఈ వేరియంట్ పూర్తిగా అడ్జెస్ట్ చేయడగలిగే ర్యాలీ స్పెక్ సస్పెన్షన్‌ ను కలిగి ఉంటుంది. నాబీ టైర్లను కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్ 220mmతో పోలిస్తే, ఇది 270mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌ తో కలిపి మంచి రైడిగ్ అనుభవాన్ని అందిస్తుంది.

⦿ హీరో కరిజ్మా XMR 250

ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతున్న మరో క్రేజీ బైక్ హీరో కరిజ్మా XMR 250. దీన్ని EICMA 2024లో ఆవిష్కరించారు. ఇది హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R మాదిరిగా 250cc మోటారుతో పవర్ ను అందిస్తుంది. స్ట్రీట్‌ ఫైటర్‌ లో 29.5bhp, 25Nm ఉత్పత్తి చేస్తుంది. ఫెయిరింగ్ మౌంటెడ్ వింగ్‌లెట్స్ ఉన్నాయి. కరిజ్మా 210 కంటే మరింత పవర్ ను కలిగి ఉంటుంది.

⦿ కవాసకి W230

కవాసకి W230 కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. W230తో రెట్రో సెగ్మెంట్‌లోకి రాబోతోంది. కొద్ది నెలల క్రితం ఈ బైక్ గురించి కంపెనీ టీజ్ చేసింది. ఇది త్వరలో దేశీ మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. ఈ రెట్రో రోడ్‌స్టర్‌కు   KLX230 డ్యూయల్ స్పోర్ట్ మాదిరిగానే ఇంజిన్ ఉంటుంది. KLX230లో, 233cc, ఎయిర్ కూల్డ్ మోటార్ 18.3bhp వపర్, 19Nm ఉత్పత్తి చేస్తుంది.  GST 2.0 కారణంగా పన్ను తగ్గడంతో ఈ బైక్ ధర రూ. 2.0 లక్షల కంటే తక్కువగా ఉండబోతోంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

⦿ KTM RC 160

KTM RC 160 బైక్ కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. KTM 160 డ్యూక్ మాదిరిగా అదే ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. యమహా R15కి  గట్టిపోటీ ఇవ్వబోతోంది. ఈ బైక్ ధర దాదాపు రూ. 1.85 లక్షల నుంచి రూ. 1.90 లక్షల వరకు ఉంటుంది.

⦿ అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్

అల్ట్రావయోలెట్ మార్చి 2025లో లాంచ్ అయ్యింది. కానీ బైక్ ఇంకా రోడ్లపైకి రాలేదు. బైక్ డెలివరీలు 2026 ఫస్ట్ క్వార్టర్ లో ప్రారంభం కానున్నాయి. డెలివరీలు ప్రారంభమైన తర్వాత, ఇది మార్కెట్లో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్ కాబోతోంది. దీని ధర రూ. 1.75 లక్షల వరకు ఉంటుంది. ఇది హీరో XPulse 210, కవాసకి KLX230కి పోటీ ఇవ్వబోతోంది.

Read Also:ఏకంగా 10కి పైగా మోడల్స్.. 2026లో మహీంద్రా లాంచ్ లైనప్ మాములూగా లేదుగా!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×