E-Paper
Advertisement

Upcoming Mahindra Cars 2026: ఏకంగా 10కి పైగా మోడల్స్.. 2026లో మహీంద్రా లాంచ్ లైనప్ మాములూగా లేదుగా!

Upcoming Mahindra Cars 2026: ఏకంగా 10కి పైగా మోడల్స్.. 2026లో మహీంద్రా లాంచ్ లైనప్ మాములూగా లేదుగా!
Advertisement

Upcoming Mahindra Cars: 2026పై మహీంద్రా  కంపెనీ ఫుల్ ఫోకస్ పెట్టింది. దేశీ మార్కెట్‌ లోకి పలు కొత్త మోడల్స్, ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్లను లాంచ్ చేయబోతోంది. వీటిలో ముఖ్యంగా SUVలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇంతకీ 2026లో లాంచ్ కాబోతున్న మహీంద్రా మోడల్స్ ఏంటి? వాటి ధరలు, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? అనేది తెలుసుకుందాం..

⦿ మహీంద్రా XUV 7XO (XUV700 ఫేస్‌లిఫ్ట్)

ఈ కారును జనవరి 5, 2026న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 15-26 లక్షలు ఉంటుంది. 2.0L పెట్రోల్ (197 hp), 2.2L డీజిల్ (182 hp), మాన్యువల్, ఆటోమేటిక్, 6, 7 సీటర్ తో రానుంది. కొత్త గ్రిల్, LED హెడ్‌ ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ లైట్స్, ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌ బోర్డ్, వెంటిలేటెడ్ సీట్లు, 16 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్, లెవల్ 2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్, 360° కెమెరా లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ మహీంద్రా స్కార్పియో N ఫేస్‌ లిఫ్ట్

Advertisement

ఈ కారు 2026 ఫస్ట్ క్వార్టర్ లో అంటే ఫిబ్రవరి-మార్చి మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.  13.8-24.8 లక్షలు ఉంటుంది. 2.0L పెట్రోల్ (200 hp), 2.2L డీజిల్ (172 hp),  మాన్యువల్, ఆటోమేటిక్ పవర్ ట్రైన్ తో రానుంది. కొత్త లైటింగ్, అల్లాయ్ వీల్స్, ట్రిమ్ అప్‌డేట్స్, 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్,  ADAS, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.

⦿ మహీంద్రా బొలెరో 2026

ఈ కారు మార్చి 18, 2026లో లాంచ్ అవకాశం ఉంది. దీని ధర రూ. 10-12 లక్షలు ఉంటుంది. 1.5L డీజిల్, మాన్యుల్ లో రానుంది. రగ్డ్ SUV, కొత్త డిజైన్, మెరుగైన ఇంటీరియర్, ABS, ఎయిర్‌ బ్యాగ్స్, 7 సీటర్ తో రానుంది.

⦿ మహీంద్రా XEV 4e

Advertisement

ఈ కారు జనవరి 2026లో లాంచ్ కానుంది. ధర రూ.13 లక్షలు నుంచి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తుంది.  60-80 kWh బ్యాటరీ, 400+ కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. INGLO ప్లాట్‌ ఫారమ్ మీద తయారైంది. డిజిటల్ క్లస్టర్, లార్జ్ టచ్‌ స్క్రీన్, ADAS, ABS, EBD ఫీచర్లతో పాటు 5 సీటర్ గా రానుంది.

⦿ మహీంద్రా BE 07

జనవరి 2026లో లాంచ్ కానుంది. ధర రూ. 29 లక్షలు నుంచి అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ లో రానుంది. బ్యాటరీ 60-80 kWh ఉంటుంది. రేంజ్ 450+ కిలో మీటర్లు అందిస్తుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, అడ్వాన్స్డ్ డిజిటల్ ఇంటర్‌ ఫేస్, ADAS, కనెక్టెడ్ టెక్, 5 సీటర్గా అందుబాటులోకి రానుంది.

⦿ మహీంద్రా గ్లోబల్ పిక్ అప్

ఈ కారు 2026 జనవరిలో లేదంటే సెప్టెంబర్ లో రానుంది. దీని ధర రూ. 16-22 లక్షలు ఉంటుంది. 2.2L డీజిల్ (150-200 hp), మాన్యువల్, ఆటోమేటిక్ పవర్ ట్రైన్ ను కలిగి ఉంటుంది. పికప్ ట్రక్, రగ్డ్ డిజైన్, హై పేలోడ్, ADAS, ట్రైలర్ స్వే మిటిగేషన్, 5 సీటర్ గా రానుంది.

⦿ మహీంద్రా eKUV100

ఈ కారు ఏప్రిల్ 2026లో లాంచ్ కానుంది. ధర రూ. 9 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ లో రానుంది. బ్యాటరీ 30 kWh, 147 కిలో మీటర్ల రేంజ్, 53 hp పవర్, 20 Nm టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మైక్రో EV SUV 5 సీటర్ గా రానుంది.

అటు మహీంద్రా XUV Aero డీజిల్ వెర్షన్, మహీంద్రా Thar E ఎలక్ట్రిక్ వెర్షన్, మహీంద్రా విజన్ X కాంపాక్ట్ SUV పెట్రోల్, డీజిల్ వెర్షన్లు, మహీంద్రా విజన్ S సబ్ కాంపాక్ట్ SUV పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో విడుదల కానున్నాయి.  మహీంద్రా 2026లో EVల పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది, INGLO ప్లాట్‌ ఫారమ్‌ తో ఫాస్ట్ చార్జింగ్,  లాంగ్ రేంజ్ అందిస్తుంది.

Read Also: జస్ట్ రూ. 5 లక్షల్లో స్టైలిష్ కారు, మతిపోగొట్టేస్తున్న మారుతి ఇగ్నిస్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×