E-Paper
Advertisement

Bike Trip: లాంగ్ బైక్ ట్రిప్ కు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి!

Bike Trip:  లాంగ్ బైక్ ట్రిప్ కు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి!
Advertisement

Long Distance Bike Trip Tips: మోటార్ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకే చాలా మంది యువతీ యువకులు టైమ్ దొరికినప్పుడల్లా లాండ్ బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తుంటారు. చక్కటి మార్గాలు, అందమైన లొకేషన్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రకృతిలో ఎంజాయ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్లాలని భావిస్తే, ఈ టిప్స్ పాటించండి. జర్నీ ఇంకా సంతోషంగా ఉంటుంది.

⦿ సాడిల్ బ్యాగ్‌లు

కారులా, మోటార్ సైకిల్ మీద ఎక్కువ ప్లేస్ ఉండదు. సాడిల్ బ్యాగ్‌లు, ట్యాంక్ బ్యాగ్‌లు, టెయిల్ ప్యాక్‌లు, దుస్తులు, టూల్స్, ట్రావెల్ గేర్‌లను తీసుకెళ్లడానికి అవసరం. వెదర్ ప్రూఫ్, లాకబుల్ ఆప్షన్స్ ను ఎంచుకోండి. మాడ్యులర్ లగేజ్ సిస్టమ్ అనేది లోడ్, అన్‌లోడింగ్‌ను ఇబ్బంది లేకుండా చేస్తాయి.

⦿ హెల్మెట్

Advertisement

లాంగ్ డ్రైవ్ కు వెళ్లే వాళ్లు మంచి క్వాలిటీ కలిగిన హెల్మెట్ ను ఉపయోగించాలి. ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సుదూర ప్రయాణాల కోసం, వెంటిలేషన్, యాంటీ ఫాగ్ వైజర్లు, సన్ షీల్డ్‌ లు, బ్లూటూత్ ఇంటిగ్రేషన్‌తో కూడిన పూర్తి ముఖాన్ని కప్పిఉంచే మాడ్యులర్ హెల్మెట్‌లను ఎంచుకోండి.

⦿ కీలకమైన డాక్యుమెంట్స్

లాంగ్ డ్రైవ్ కు వెళ్లినప్పుడు సరైన డాక్యుమెంట్స్ తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, RC-రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, బైక్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.  ఈ పత్రాలను హార్డ్ కాపీస్ తో పాటు డిజిటల్ కాపీలను వాటర్‌ ప్రూఫ్ పర్సులో సేఫ్ గా పెట్టుకోవాలి. చెక్‌పాయింట్ల దగ్గర అత్యవసర సమయాల్లో ఇవి ఉపయోగపడుతాయి.

⦿ రైడింగ్ సూట్   

Advertisement

రైడింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సూట్ ధరించాలి. ఇది వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుతుంది. అత్యవసర పరిస్థితుల నుంచి ఈ సూట్ మిమ్మల్ని రక్షిస్తుంది. భుజాలు, మోచేతులు, మోకాలు, తుంటి లాంటి భాగాలను రక్షించుకునేలా సూట్ వేసుకోవాలి. CE- రేటెడ్ రాపిడి ప్రూఫ్ మెటీరియల్ తో తయారు చేయబడిన టూరింగ్ జాకెట్లు, ప్యాంట్లను ధరించాలి. ఇవి మంచి భద్రతను అందిస్తాయి.

⦿ నావిగేషన్, కమ్యూనికేషన్ టూల్స్

లాంగ్ డ్రైవ్ కు వెళ్లే సమయంలో తెలియని, సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే, మోటారు సైకిల్ కు  GPS పరికరం, ఆఫ్‌ లైన్ మ్యాప్స్ యాప్‌ తో కూడిన స్మార్ట్‌ ఫోన్ ను మిమ్మల్ని ట్రాక్ లో ఉంచుకునేలా చూడండి. బ్లూటూత్ హెడ్‌ సెట్లు కమ్యూనికేషన్ కోసం, టర్న్ బై టర్న్ డైరెక్షన్స్ నావిగేషన్ అందించేలా చూసుకోవాలి.

⦿ హైడ్రేషన్, స్నాక్స్, హెల్త్ ఎసెన్షియల్స్

లాంగ్ రైడ్‌ సమయంలో అలసిపోయే అవకాశం ఉంటుంది. హైడ్రేషన్ ప్యాక్, బాటిల్ మౌంట్  హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. ఎనర్జీ బార్‌లు, ఎలక్ట్రోలైట్ సాచెట్‌లు,  పెయిన్ కిల్లర్స్, యాంటీసెప్టిక్ వైప్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ను తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రైడ్ ను మరింత హ్యాపీగా కొనసాగించే అవకాశం ఉంటుంది.

Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 Vs యమహా XSR 155.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×