E-Paper
Advertisement

Anasuya on Sivaji: శివాజీ మాట్లాడింది కరెక్టే.. వెనక్కి తగ్గిన అనసూయ !

Anasuya on Sivaji: శివాజీ మాట్లాడింది కరెక్టే.. వెనక్కి తగ్గిన అనసూయ !
Advertisement

Anasuya on Sivaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా  శివాజీ (Sivaji)వర్సెస్ అనసూయ (Anasuya)అనే విధంగా వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. శివాజీ దండోరా సినిమా వేడుకలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. దీంతో హీరోయిన్లు పలువురు సెలబ్రిటీలు శివాజీపై దండెత్తారు. ఈ వివాదంలో అనసూయ కాస్త ఘాటుగా స్పందిస్తూ శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు పెద్ద వివాదానికి దారి తీసాయి. ఇలా వీరిద్దరి మధ్య చెలరేగిన వివాదం ఇప్పటికీ సద్దుమనగలేదని చెప్పాలి. ఇలా ఈ వివాదం పట్ల కొంతమంది అనసూయకు మద్దతు తెలియ చేయగా మరికొందరు శివాజీకి మద్దతు తెలియజేశారు.

శివాజీ గొప్ప స్థాయికి చేరుకున్నారు..

శివాజీ చేసిన ఈ వ్యాఖ్యల గురించి ఇప్పటికీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా అనసూయ మరొక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె శివాజీ మాట్లాడిన మాటలు కరెక్టే అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి అనసూయ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా అనసూయ మాట్లాడుతూ… శివాజీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి మంచి స్థాయికి చేరుకున్నారు. ప్రజలు, ప్రేక్షకులు శివాజీ చెప్పిన మాట వినే స్థాయికి ఆయన చేరుకున్నారని తెలియజేశారు.

అబ్బాయిలకు బాధ్యత గుర్తు చేయాలి..

Advertisement

మహిళల విషయంలో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు నిజమేనని తెలిపారు. మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం కరెక్టేనని అనసూయ తెలిపారు. ఇలా అమ్మాయిలను హెచ్చరించడమే కాకుండా అబ్బాయిల గురించి కూడా ఆయన మాట్లాడుతూ వారికి కూడా వారి బాధ్యతను గుర్తు చేసి ఉంటే బాగుండేదని ఈమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అనసూయ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నేటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ ఈ సమాధానం చెప్పడం విశేషం. శివాజీ ఉద్దేశం కరెక్టే కానీ ఆయన రెండు పదాలను తప్పుగా మాట్లాడారు అంటూ ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ ఈ సమాధానం తెలియచేశారు.

Advertisement

ఇలా శివాజీ వ్యాఖ్యల పట్ల అనసూయ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చివరికి శివాజీనే నెగ్గారని, అనసూయ శివాజీ విషయంలో వెనకడుగు వేశారు అంటూ పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొదటినుంచి కూడా చాలామంది శివాజీకి మద్దతు తెలుపుతూ వచ్చారు .శివాజీ ఉద్దేశం కరెక్టే కానీ, ఆయన మాట్లాడిన విధానం తప్పు అంటూ పలువురు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇక అనసూయ తాజాగా షేర్ చేసిన ఈ వీడియోతో ఈ వివాదానికి పులి స్టాప్ పడుతుందా? లేదంటే మరో వివాదం చెలరేగుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: MSVPG Pre release: ఈ సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమదవ్వాలి.. చిరంజీవి స్పీచ్ వైరల్!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×