E-Paper
Advertisement

EV Scooter Maintenance Tips: ఎలక్ట్రిక్ స్కూటర్‌ స్మూత్ గా నడవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే!

EV Scooter Maintenance Tips: ఎలక్ట్రిక్ స్కూటర్‌ స్మూత్ గా నడవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే!
Advertisement

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరిగింది. ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గత రెండు సంవత్సరాలుగా గణనీయంగా పెరిగాయి. చాలా మందికి ఎలక్ట్రిక్ స్కూటర్ల మెయింటెనెన్స్ మీద సరైన అవగాహన లేక, త్వరగా చెడిపోతున్నాయి. అలా కాకుండా సరిగ్గా మెయింటెనెన్స్ చేస్తే దాని లైఫ్ టైమ్ ను పెంచే అవకాశం ఉంటుంది. రైడర్ భద్రత కూడా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి మెయింటెనెన్స్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం ఏద్దాం..

ప్రతి వారం ఎలక్ట్రిక్ స్కూటర్ ను చెక్ చేయండి!

ఎలక్ట్రిక్ స్కూటర్ ను వారానికి ఓసారి పూర్తిగా చెక్ చేయాలి. ఏవైనా స్క్రూలు, ఇతర భాగాలు లూజ్ అయితే, వాటిని చక్కగా బిగించాలి. టైర్లలో గాలి సరిగా ఉందా? లేదా? అని చెక్ చేయాలి. ఒకవేళ అవసరమైన మేర గాలి లేకపోతే ఫిల్ చేయించాలి. బ్రేక్‌లు సరిగా పడుతున్నాయా? లేదా? అనేది చూడాలి. బ్యాటరీ ఛార్జ్ లెవల్స్ ను కూడా చెక్ చేయాలి. దుమ్ము, ధూళి పట్టకుండా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుభ్రం చేయాలి.

బ్యాటరీ ప్రొటెక్షన్, ఛార్జింగ్ విధానం

Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్ ముఖ్యమైన భాగాలలో ఒకటి బ్యాటరీ. సరైన మెయింటెనెన్స్ ద్వారా బ్యాటరీ లైఫ్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ ఛార్జర్లను ఉపయోగించకపోవడం మంచిది. తయారీదారు సిఫార్సులకు అనుగుణంగా నడుచుకోవాలి.  వేడెక్కకుండా ఉండటానికి, బ్యాటరీ నిండిన వెంటనే ఛార్జర్‌ ను డిస్‌ కనెక్ట్ చేయాలి. బ్యాటరీ ఛార్జింగ్ ఎప్పుడైనా సున్నాకు పడిపోకుండా చూడాలి. ఎక్కువ కాలం ఉపయోగించకపోతే 40–60% ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చల్లని ప్రదేశంలో పార్క్ చేయాలి.

టైర్ మెయింటెనెన్స్, ఎయిర్ చెకింగ్

సురక్షితమైన రైడ్ సరైన టైర్ ప్రెజర్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే, టైర్ ప్రెజర్ సిఫార్సు చేయబడిన స్థాయిలో ఉందా? లేదా? అనేది చూడాలి. అరిగిపోయిన ట్రెడ్‌లు, పగుళ్లు, పంక్చర్లు ఉన్నాయేఊమో చూడాలి. ఇవి గ్రిప్‌ను దెబ్బతీస్తాయి. ప్రమాదాలను నివారించడానికి  ట్రెడ్ అరిగిపోయినా, టైర్ సమస్యలు ఉన్నా వెంటనే మార్చాలి.

బ్రేక్ సిస్టమ్ మెయింటెనెన్స్  

Advertisement

భద్రత కోసం బ్రేక్ సిస్టమ్ చాలా అవసరం. అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్‌లు ప్రమాదానికి కారణం అవుతాయి. అందుకే, సిఫార్సు మేరకు కొత్త బ్రేక్ ప్యాడ్స్ వేసుకోవాలి. పనితీరును మెరుగుపరచడానికి, అవి లూజ్ అయినా, సరిగా బ్రేక్ పడకపోయినా,  బ్రేక్ టెన్షన్‌ను సర్దుబాటు చేయాలి. గ్రిప్‌ను మెరుగుపరచడానికి, డిస్క్ బ్రేక్‌లపై కాలిపర్ స్క్రూలను బిగించాలి. డ్రమ్ బ్రేక్‌లతో బ్రేకింగ్‌ను నిర్ధారించడానికి, టెన్షన్ కేబుల్‌ను చెక్ చేయాలి.

మోటార్, ఎలక్ట్రికల్ సిస్టమ్ కేర్

స్కూటర్ చక్కగా పని చేయాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన ఎలక్ట్రికల్, మోటార్ ను పరిశీలించాలి. మోటారును శుభ్రంగా ఉంచాలి. దాని మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించాలి. ఏవైనా దెబ్బతిన్న, వదులుగా ఉండే వైర్లను సరిచేయాలి. వింత శబ్దాలు చేస్తే బ్యాటరీ అవుట్‌ పుట్, మోటార్ కనెక్షన్లను పరిశీలించాలి.

సస్పెన్షన్, ఫ్రేమ్ చెకింగ్

ఎలక్ట్రిక్ స్కూటర్ చక్కగా ఉండేందుకు ఫ్రేమ్, సస్పెన్షన్ వ్యవస్థ బాగుందా? లేదా? అనేది చూసుకోవాలి. ఫ్రేమ్‌పై పగుళ్లు, వదులుగా ఉండే ఫిక్స్ చేయాలి. సస్పెన్షన్ భాగాలు, జాయింట్స్ ను లూబ్రికేట్ చేయాలి. ఈ జాగ్రత్తలు క్రమం తప్పకుండా చేయడం వల్ల దాని జీవిత కాలం పెరుగుతుంది.

Read Also: కొత్త టాటా పంచ్ EV vs MG విండ్సర్ EV.. ఈ రెండు కార్లలో ఏది కొంటే బెస్ట్?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×