E-Paper
Advertisement

Tata Punch EV vs MG Windsor EV: కొత్త టాటా పంచ్ EV vs MG విండ్సర్ EV.. ఈ రెండు కార్లలో ఏది కొంటే బెస్ట్?

Tata Punch EV vs MG Windsor EV:  కొత్త టాటా పంచ్ EV vs MG విండ్సర్ EV.. ఈ రెండు కార్లలో ఏది కొంటే బెస్ట్?
Advertisement

ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా EV విభాగంలో టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ అడుగు పెట్టింది. ఇప్పటికే ఉన్న మోడల్ మరింత అప్ డేట్ అయి వచ్చింది. ఈ కారుతో MG విండ్సర్ EV గట్టిగా పోటీ పడుతోంది. రెండు కార్లు కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తున్నాయి.  అయితే, ఈ కార్లలో దేనిలో మంచి ఫీచర్లు ఉన్నాయి? ఏది ఎక్కువ రేంజ్ ఇస్తుంది? ధర ఎలా ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త టాటా పంచ్ EV vs MG విండ్సర్ EV  ధరలు

పంచ్ EV ఎంట్రీ EVగా, విండ్సర్ పెద్ద SUVగా మార్కెట్ లోకి అడుగు పెట్టాయి. పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ బేస్ వేరియంట్ ధర రూ. 9.69 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 12.59 లక్షల వరకు ఉంటుంది.  MG తన బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ (రూ. 3.9/కిమీ) ద్వారా విండ్సర్ EVని రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.99 లక్షల ధర పరిధిలో అందిస్తుంది. బ్యాటరీని చేర్చినట్లయితే రూ. 14 లక్షల నుంచి రూ. 18.50 లక్షల వరకు ఉంటుంది.

కొత్త టాటా పంచ్ EV vs MG విండ్సర్ EV బ్యాటరీ, రేంజ్   

Advertisement

పంచ్ EV 30 kWh, 40 kWh బ్యాటరీ ఆప్షన్స్ తో వస్తుంది.  గరిష్టంగా రియల్ వరల్డ్ పరిధి 355 కిమీ వస్తుంది. ARAI సర్టిఫైడ్ క్లెయిమ్డ్ రేంజ్ 468 కిమీ వరకు ఉంటుంది. ఇది సిటీ డ్రైవింగ్, రొటీన్ ఛార్జింగ్ ప్యాటర్న్‌ లకు అనువైనది. MG విండ్సర్ EV కి 38 kWh, 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 182.3 hp, 200 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ గరిష్టంగా 449 కి.మీ రేంజ్ ను కలిగి ఉంటుంది.

కొత్త టాటా పంచ్ EV vs MG విండ్సర్ EV  ఫీచర్లు  

పంచ్ EV ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండాల్సిన అన్ని EV సౌకర్యాలు, భద్రతా ఫీచర్లను అందిస్తుంది. విండ్సర్ EV కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV లకు అనుగుణంగా ఉంటుంది. మంచి స్పేస్, చక్కటి యాక్సెసరీస్ ఉంటాయి. పంచ్ EV టియాగో EV లాంటి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV లతో పోటీ పడుతుండగా, విండ్సర్ EV భారతీయ మార్కెట్లో పెద్ద ఎలక్ట్రిక్ SUVగా అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వాళ్లు పంచ్ EVని తీసుకోవడం మంచిది. పెద్ద ఎలక్ట్రిక్ SUV కావాలనుకునే వారు విండ్సర్ ను కొనుగోలు చేస్తారు.

ఇండియన్స్ కు ఏ కారు బెస్ట్?  

Advertisement

తక్కువ కొనుగోలు ఖర్చులు, నగరాల్లో ప్రయాణించడానికి పంచ్ EVని ఎంచుకోవచ్చు. ఫ్యామిలీ అవసరాలు, దూర ప్రయాణాలు, పెద్ద కారు కావాలనుకుంటే విండ్సర్ EVని  తీసుకోవడం మంచిది.

Read Also:  టాటా To ఎంజీ.. ఇండియాలో చౌకైన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×