E-Paper
Advertisement

Yash Toxic Movie: ‘టాక్సిక్’ నుండి యశ్ మేకోవర్ వీడియో.. AI ట్రోల్స్ పై హెయిర్ స్టైలిస్ట్ క్లారిటీ!

Yash Toxic Movie: ‘టాక్సిక్’ నుండి యశ్ మేకోవర్ వీడియో.. AI ట్రోల్స్ పై హెయిర్ స్టైలిస్ట్ క్లారిటీ!
Advertisement

Yash Toxic Movie:ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) దర్శకత్వంలో యాక్షన్ కమర్షియల్ మూవీగా రూపొందుతున్న చిత్రం టాక్సిక్ (Toxic). కేజిఎఫ్ 1 & 2 చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ హీరో యశ్(Yash).. ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అవుతూ.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ లో మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మరోవైపు యశ్ “టికెట్ ” లుక్ ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు.

యశ్ టికెట్ లుక్..

ఇకపోతే ఎప్పుడూ గుబురు గడ్డంతో చాలా స్టైలిష్ గా కనిపించే యశ్.. ఈ టికెట్ లుక్ లో తొలిసారి ఆయన పూర్తి షేవింగ్ లుక్ లో కనిపించేసరికి అభిమానులు ఊహించుకోలేకపోయారు. పైగా ఇది ఏఐ లుక్ అంటూ ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పుకార్లను కొట్టివేస్తూ ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలెక్స్ విజయ్ కాంత్ ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ ఏఐ ట్రోల్స్ పుకార్లకు చెక్ పెట్టారు.

యశ్ మేకోవర్ వీడియో.. ఏఐ ట్రోల్స్ కి చెక్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. టాక్సిక్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఒకటి రోయా.. మరొకటి టికెట్.. రోయా పాత్రలో రగ్డ్ లుక్ లో కనిపించగా.. టికెట్ లుక్ లో యువకుడిగా కనిపించారు. ముఖ్యంగా ఈ లుక్ కళ్ళు చెదిరేలే ఉన్నా ఏఐ ద్వారా క్రియేట్ చేశారని వార్తలు వినిపించాయి . ఈ నేపథ్యంలోనే హెయిర్ స్టైలిస్ట్ అలెక్స్ విజయ్ కాంత్ యశ్ లుక్ ఎలా మారిందో చూపించే వీడియోని షేర్ చేశారు. ఇందులో యశ్ మేకోవర్ ను చూపించడం జరిగింది. హెయిర్ కట్, గడ్డం ఫుల్ షేవింగ్ చేయించుకున్న తర్వాత చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం టికెట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే ఈ ఒక్క మేకోవర్ వీడియోతో రూమర్స్ కి చెక్ పెట్టారు విజయ్ కాంత్.

పరిపూర్ణతకి నిలువుటద్దం..

ఇకపోతే యశ్ మేకోవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో .. యశ్ పరిపూర్ణత గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. ప్రతీదీ కూడా పరిపూర్ణంగా చేయాలనుకుంటాడు. అందులో భాగంగానే కేజిఎఫ్ 1 &2 చిత్రాలతో ఆయన పరిపూర్ణత మనకు కనిపిస్తుంది. ఇక టాక్సిక్ చిత్రాన్ని కూడా ఆయన అంతే బాధ్యతగా తీసుకున్నాడని చెప్పాలి. ఈ చిత్రానికి కథ రాయడమే కాకుండా నిర్మాతలలో ఒకరిగా కూడా బాధ్యత వ్యవహరిస్తున్నారు. టాక్సిక్ చిత్రంలో బోరో టికెట్ పాత్రను కూడా ఆయనే పోషించడం ఆయన బాధ్యతకు నిలువుటద్దంగా మారింది.

Advertisement

ALSO READ:Toxic Movie: టాక్సిక్ నటీనటుల రెమ్యూనరేషన్.. హీరో కాకుండా హైయెస్ట్ ఎవరికంటే?

టాక్సిక్ సినిమా విశేషాలు..

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 5 మంది హీరోయిన్లు నటిస్తూ ఉండడం గమనార్హం. లేడీ సూపర్ స్టార్ నయనతార యశ్ సోదరి పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు రుక్మిణి వసంత్ , తారా సుతారియా, హుమా ఖురేషి కీలకపాత్రలు పోషిస్తున్నారు..

 

 

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×